నా ప్రశ్నకు ఎవరు సమాధానం చెబుతారు అని అడవ ి నుంచీ వచ్చాను అనుకున్నారు కదా!

అనగనగా ఒక చిరుత అది మనుషులకి తారస పడింది మనిషి భయ పడటం మొదలు పెట్టాడు, జంతువులతో మాట్లాడే శక్తి ఉన్న ఒక మనిషి ఆ చిరుతను పలకరించాడు

చిరుత: ఏమిటి ఇలా వచ్చావు?

మనిషి: నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నవో తెలుసుకుందాం అని.

చిరుత: నిన్నటి వరకూ ఇక్కడే తిరిగాను ఈరోజు తిరిగితే తప్పు ఏమిటి?

మనిషి:అదేమిటి ఎప్పుడో ౩౦ సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఈ రోజు నువ్వు తారస పడి వీళ్ళను భయ పెడుతున్నావు!

చిరుత: సాక్ష్యం ఏమిటి?

ఆ మనిషి కొన్ని కాగితాలు తీసుకుని చూపించాడు, అప్పుడు చిరుత ఒక్కసారిగా అరిచింది

చిరుత: ఓరీ మూర్ఖుడా ఈ ఊరి పేరు అది కాదు అసలు ఇది ఊరు కాదు, ఆ ఊరు ఇక్కడ నుంచీ రెండు జిల్లాల అవతల ఉంది ఆ ఊరులోని కాగితాలు ఇక్కడకు తెచ్చి ఇక్కడ నీకు చూపించారు.

మనిషి: అయితే ఇక్కడ చెట్లు ఉండాలి కదా ఏమైనాయి?

చిరుత: మనిషి అభివృద్ధి పేరిటి చేస్తున్న వినాశనము ఇది.

మనిషి: అంటే?

చిరుత: ౩౦ రోజుల క్రితం ఒక Bulldozer వచ్చింది చెట్లను ప్రజలు యంత్రాలతో కోసి ఆ Bulldozer సాయంతో తరలించారు తరువాత ఇక్కడ వీళ్ళు గుడిసెలు వేసుకున్నారు, ఇప్పుడు ఈ స్థలం నాది అంటున్నారు, వాటికి పత్రికల తోడూ

మనిషి: అంటే వీళ్ళు చెబుతున్నది అబద్దమా?

చిరుత: అసలే ఆకలితో ఉంటే నీ ప్రశ్నలు ఏమిటి?

అని ఆ మనిషిని తినేసింది!

ఇప్పటికీ ఆ చిరుత చెప్పింది నిజమో మనిషి చెప్పింది నిజమో తెలియక చిరుత నే నిందిస్తూ ఉన్నాను………….

About these ads

శర్మ కాలక్షేపంకబుర్లు-పాలకోసం రాళ్ళుమోయడం !

Reblogged from కష్టేఫలే:

Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post

పాలకోసం రాళ్ళు మోయడం.

"పాలకోసం రాళ్ళు మోయడం"అనే నానుడి తెనుగునాట విస్తృతంగా వాడతారు. దీని అర్థం విస్తృత ప్రయోజనం కోసం కష్టపడటమని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఉదాహరణ, ఒక సామాన్యుడు తన కొడుకు/కూతురు అభివృద్ధికోసం పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి కూడా కష్టపడి సంపాదించి వారి చదువు కోసం కష్టించడం, ఇలా చెప్పుకోవచ్చు. మరి దీనికి పాల కోసం రాళ్ళు మోయడానికి సంబంధం ఏమని కదా మీ ప్రశ్న, అదుగో అక్కడికే వస్తున్నా.


పాడి పంట అన్నారు కదా! పల్లెలలో ఉదయమే పొలం వెళ్ళడం అలవాటు చేసుకోడం కోసమనీ, పాలు పితుక్కుని తెచ్చుకోడంకోసమనీ, పొలం చూసుకోడం కోసమనీ, బహుళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, పశువులను పొలంలో ఉంచేవారు, పశువులకు తగినంత మేత అక్కడే ఉంటుంది కనక, ఒక పాక వేసి పశువులను అందులో కట్టేవారు.

శర్మ కాలక్షేపంకబుర్లు-మిథునం అద్భుతః (బాపు గారి స్వదస్తూరితో)

Reblogged from కష్టేఫలే:

  • Click to visit the original post

http://www.youtube.com/watch?feature=player_embedded&v=13TQ13cdrXg

Courtesy you tube

mithunam         పై క్లిక్ చేసి కధ చదవండి.(బాపు గారి స్వదస్తూరితో)

Courtesy C.V.L.N.Ravi kumar

మిథునం అద్భుతః

"మిథునం సినిమా చూడు బాబాయ్" అన్నాడు, అబ్బాయి,ముంబాయి నుంచి. "ఏదిరా! చూదామని కూచుంటే కరంటు వాడికి కన్ను కుట్టిం"దంటే మర్నాడు బ్లాగ్ లో పెట్టేసేరు జిలేబి గారు. ఇల్లాలితో కలిసి చూశా, "సంబడమే, బానే ఉంది, మీ నిరవాకమే" అంది ఇల్లాలు. నిన్న అబ్బాయి పిలిచి "బాబాయ్! సినిమా చూశావా?" అన్నాడు. "చూశానయ్యా!" అంటే "ఎలా ఉంద"న్నాడు "అద్భుతః" అన్నా, గలగలా నవ్వేడు.

Import-ant News for Google Reader Users

Reblogged from WordPress.com News:

Click to visit the original post

The big news on the internet the last couple of days has been that seminal RSS reader Google Reader will be shutting down on July 1, 2013. Google Reader had lots of fans, including many of us here at Automattic, but it's time to move on.

Speaking of moving on from Google Reader, did you know that you can import your subscriptions directly from Google Reader into…

ఇంకా చదవండి… 107 more words

శర్మ కాలక్షేపం కబుర్లు-ఏకాదశ రుద్రం

Reblogged from కష్టేఫలే:

  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post

http://www.youtube.com/watch?v=1_UjqNOJxxU&feature=player_detailpage

Courtesy google

నమక, చమక సహిత మహన్యాసం, వినండి. నేను మహన్యాసం విన్నంతలో, ఇంత గొప్ప శృతిలో కమనీయంగా పారాయణ చేసినవారు కనబడలేదు. చాలా కాలం నుంచి ఈ పారాయణ వింటున్నాను, కాని ఎవరు పారాయణ చేసేరో తెలియలేదు.

పని కట్టుకుని వెతికి పట్టుకున్నా. .మన కోసం ఒక గంటన్నర సేపు  పారాయణ చేసినవారు కొత్తగూడెం వాస్తవ్యులు శ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి గారని తెలిసింది. దీనిని యూ ట్యూబ్ లో పెట్టినవారు శ్రీ కొత్త చంద్ర గారికి అభినందనలు.  శ్రీ శాస్త్రి గారికి సాష్టాంగ నమస్కారం, వీరిపుడు అమెరికాలో ఉన్నారు..శివరాత్రి పూటా ఏమీ చేయలేకపోయినా శ్రద్ధగా వినండి, మీ పని చేసుకుంటూనయినా సరే!.

తెలుగు లో వ్రాసే ప్రయత్నం

google chrome addon quilpad ఇచ్చింది కొంచం నెమ్మదిగా వ్రాయాలి ఎందుకంటే ప్రస్తుతానికి ఇది ఇంటెర్నెట్ నుంచీ దిగుమతి చేసుకుంటుంది.

శర్మ కాలక్షేపంకబుర్లు-అర్ధం

Reblogged from కష్టేఫలే:

Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post

అర్ధం

అర్ధం అంటే సగం, ద్రవ్యం,భావం అని నానార్ధాలున్నాయి. మనకేంటీ స్వేఛ్ఛాజీవులం కదా అన్నిటిగురించి వరసగా చెప్పుకుందాం. ఊ... అన్నారా? మౌనంగా ఉన్నారా? ఊ.... అంటే ముక్కుతో ఒప్పుకోలుట, మౌనం అర్ధాంగీకారం అన్నారు. అంటే పూర్ణాంగీకారం లేదాండీ అనద్దు. అర్ధాంగీకారం అంటే చెప్పిన విషయం మీద అభిప్రాయం లేదనీ, కొంత ఒప్పుకున్నట్లు లెక్కన మాట.

రెండు అర్ధాలు కలిస్తే ఒకటి. దీనికి మానం కూడా ఉంది. మానం రాకపొతే అవమానంరా అనేవారు, మా లెక్కల మాస్టారు. ఇప్పుడు ఈ మానం లేదు, అన్నీ దశాంశ పద్దతే. చిత్రమేమంటే, శూన్యాన్ని కనుక్కున్నది భారతీయులు, కాని దీన్ని ఫ్రాన్స్ వారు స్వంతం చేసుకున్నారు. ఇలా చాలా విజ్ఞానం మనది పశ్చిమదేశాలవారిదిగా చెలామణీ అవుతోంది.
2గిద్దలు = అరసోల
2 అరసోలలు =సోల
2సోలలు = తవ్వెడు
2తవ్వలు =మానిక లేక శేరు.
2మానికలు = అడ్డ ( వాడుకలో అర్ధ కాస్తా అడ్డగా మారింది).
2అడ్డలు = కుంచెడు.

ఇలాగే ద్రవ్య మానం చూడండి

2దమ్మిడీలు=ఏగాణీ
2ఏగానులు=కాణీ
2కానులు= అర్ధణా
2అర్ధణాలు=అణా
2అణాలు=బేడ
2బేడలు=పావులా
2పావులాలు=అర్ధ రూపాయి
2అర్ధ  రూపాయలు= ఒక రూపాయి

తులామానం చూడండి.
3తులాలు= ఒక ఫలం
5ఫలాలు=ఒక పంపు
2పంపులు=ఒక ఏబులం
2ఏబులాలు=ఒక పదలం
2పదలాలు=ఒక వీశ లేక 120 తులాలు.(ఈ మానం లో భారతీయ ఆత్మ ఉంది జాగ్రత్తగా పరిశీలించండి. )

ఈ సృష్టి సమస్తం అర్ధనారీశ్వర తత్వం. రెండు అర్దాలు కలిస్తేనే ఒకటి. దానినే "ఏకం సత్ విప్రా బహుధా వదంతి" అన్నారు. అంటే, ఒకటే అయిన భగవంతుని తెలిసినవారు వివిధ రకాలుగా చెప్పేరు, అని. అదేo, ఒకలాగే చెప్పచ్చుగా, కాదు, ఎవరికి ఎలా చెబితే భావం చేరుతుందో అలా చెప్పేరనమాట. ఒకరికి తీపి, మరొకరికి కారం, మరొకరికి పులుపు ఇష్టం, కాని అవన్నీ ఆహారమేకదా! అలాగనమాట. అందుకే ఒకరికి రాముడిగా కనపడితే, మరొకరికి కృష్ణుడిగా కనపడతాడు, మరొకరికి అమ్మగా, ఇలా అనేక రూపాలు, కాని వస్తువు ఒకటే. అన్ని ఆభరణాలలోనూ ఉన్నది ఒకటే, అది బంగారం, కాని ఒకదానిని చూచిగాజులంటే,మరొకటి కంటె, మరొకటి కాసులపేరు. అలాగే శక్తినిచ్చే ఆహారం, నోరు దాటితే రుచి తెలుస్తుందా? అప్పుడు సర్వం జగన్నాధం, అంతా ఒకటే, అందుకే మందు గొంతుకలో పోసుకోమన్నారు, రుచి తెలియకుండా ఉండటానికే. :) రుచికాదు ముఖ్యం వ్యాధి నివారణ ముఖ్యంకదా.

రెండు సగాలు, శివుడు, శక్తి, రాత్రి ,పగలు,  పురుషుడు, స్త్రీ, అన్ని రెండే చూడండి. ఎత్తు, పల్లం, నీరు, నిప్పు, సిరి, దరిద్రం, భూమి, ఆకాశం, మానవ మస్తిష్కం రెండు భాగాలు, రెండు విరుద్ధాలు కలసి ఒకటి.  సైన్స్ లో కూడా శక్తిని రెండనే చెబుతారు. స్థితి శక్తి, గతి శక్తి. ఇవి ఒక దానికొకటి సంపూరకాలు. శివుడు జడుడు, శక్తి చేరితే, చైతన్యవంతుడు. మనం కూడా భార్య/భర్తతో కూడి ఉంటే శక్తివంతులం, బలవంతులం, లేకపోతే, నిర్బలులం, నిర్భాగ్యులం.  ఇది గమనించుకోక ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని పోట్లాడుకోవడం తెలివయిన పనా? అందుకే భారతీయ కుటుంబ వ్యవస్థ లో మూల సూత్రం, అందరికోసం ఒక్కరు, ఒక్కరికోసం అందరు. ఇది ఎంత గొప్ప సూత్రం, అయితే దీనికి మనసు జోడింపు జరిగితేనే కావలసిన ఫలితాలుంటాయి, లేకపోతే అది ఉత్తి వ్యర్ధవాదమయిపోతుంది.  స్త్రీని శక్తిగా కొలుస్తాం, శక్తి చేరని శివుడు జడుడేగా,.అందుకే అమ్మని, అమ్మాయిని పూజించాలి, గౌరవించాలి, గుడులు గోపురాలు కట్టద్దు, వారిని సాటివారిగా గుర్తించి, గౌరవించి, వారి పట్ల మన కృతజ్ఞత తెలియచేద్దాం. అమ్మ స్త్రీ, చెల్లి స్త్రీ, భార్య స్త్రీ, వారు లేనిది నిమిషం జీవితం లేదు.ఇతరులు మనకు ఏం చేస్తే అప్రియమో అవి మనం మరొకరికి చేయకుండటమే ధర్మం కదా! అటువంటపుడు మరో తల్లిని, చెల్లిని పాడు దృష్టితో చూడటమే పాపం కదా! మరి దీనికెందుకుఒడి కడుతున్నారు? మానవ జనాభాలో సగమైన స్త్రీని ఎందుకు బాధలపాలు చేస్తున్నారు? ఇది మన పట్ల మనం చేసుకుంటున్న ద్రోహం కాదా. ఆలోచించండి.

ఈ వేళ ఒక చిన్న సంఘటన. బేంకుకి వెళ్ళేను, మగవారెవరూ సరిగా పట్టించుకున్నట్లు లేదు, కౌంటర్లో ఇద్దరమ్మాయిలున్నారు, ఒకమ్మాయి దగ్గరకెళ్ళి చెక్ బుక్, పాస్ బుక్ కావాలమ్మా, ఇదిగో మేనేజర్ గారిచ్చిన ఉత్తరం అన్నా. ఒకమ్మాయి చూసి "తాతగారు ఒక గంట కూచోగలరా?' అంది. "మళ్ళీ వస్తానమ్మా,కూచోలేను, ఎప్పుడు రమ్మన్నా"వన్నా." మీరు మధ్యాహ్నం మూడున్నరకి రండి, మీ పని చేసి పెడతా"మన్నారు. సరేనని వచ్చేశా, మధ్యాహ్నం వెళ్ళా,""తాత గారు! ఈ వేళ కొన్ని వందల శూన్య కాతాలు మొదలుపెట్టేం, అది హడావుడి ఒక్క ఐదు నిమిషాలేం" అన్నారు.  ఇద్దరూ చకచక చేతిలో ఉన్న పని పూర్తిచేసి, నా పని చేసి ఇచ్చేశారు. "అమ్మలూ! మీ ఇద్దరిగురించీ అబ్లాగులో రాస్తానేం" అన్నా.ఇద్దరూ నవ్వేశారు, నాకు ముచ్చటే అనిపించింది, వారి పని చూసి, గౌరవం ఇవ్వడం చూసి. మరి మగవాళ్ళకేమొచ్చింది, దొమ్మ తెగులు. అదే మగవాళ్ళయితే నా పని ఈవేళ గోవిందా.

మన శరీరంలో ఇంద్రియాలు,చెవులు,ముక్కు, కళ్ళు,కాళ్ళు, చేతులు , ముఖ్యమైనవి ఇవన్నీ రెండుగా ప్రసాదించాడు భగవంతుడు. మరో రెండు ఇంద్రియాలకి సంబంధించి ఒక్కొకటే పెట్టేడు, ఎందుకంటే మానవులు భోగలాలసులు, ఒక్కొక ఇంద్రియంతోనే, తప్పుదారి పడతారని భగవంతుడు దయతో ఒక్కొటే ప్రసాదించాడు.

మన సంఖ్యా శాస్త్రానికి ప్రామాణికాలు మన దేహమే, రెండు చేతులు నుంచీ మొదలు పెట్టి ౧౦ వెళ్ళు మరియు ద్వాదశ(౪X౩) మాసాలు.

శర్మ కాలక్షేపంకబుర్లు-పాత కాలపు ఉపకరణాలు.

Reblogged from కష్టేఫలే:

Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post
  • Click to visit the original post

చాలా మందికి, అనగా నేటి వారికి ఇదేంటో తెలియదనే చెప్పాలి. అదేంటో చెప్పుకోండి చూద్దాం.

తిరగలి, దీనిని పిండి చేసుకోడానికి, నూక విసరడానికి, పప్పులు చేసుకోడానికి వాడేవారు, ఇప్పుడు మిక్సీ లాటిది.తిరగలితో విసరడం కబుర్లు చెప్పినంత తేలికకాదు.గింజలు పోసి కొద్దిగా పై రాయి ఎత్తి నెమ్మదిగా విసరాలి. గబ గబా విసిరితే పప్పు నూకయి ఊరుకుంటుంది. చిన్నప్పుడు అమ్మ దగ్గర విసరడం నేర్చుకున్నాఅ. ఇప్పుడు ఇల్లాలు  దగ్గరకి రానీయటం లేదు, విసరడానికి :)

పార, ఇది ఒక వ్యవసాయ పని ముట్టు. దీని వాడకం కూడా తగ్గిపోతూంది, పల్లెలలో కూడా.దీనితో చేసేపని ఇప్పుడు పెద్ద యంత్రాలు చేస్తున్నాయిప్పుడు, పల్లెలలో.పారతో పని చెయ్యాలంటే నడ్డి వంచి పని చెయ్యాలి అబ్బో!

కొత్త చెత్త విధానం.

మీ అభిప్రాయాలు చెప్పగలరు

irctc

Indianrailways

Looting

 

అఁటిఁచబడ్డవి , ,
అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 88గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: