అసలు ఈ ప్రశ్న ఎందుకు తలెత్తింది, పెళ్ళికి మునుపు భార్యను అందరి భర్తలలా కాదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు పంపుతాను అంటాము, పెళ్ళయ్యాకా అసలు నేను అన్నానా అని ప్రశ్నిస్తాము!

స్వేచ్చా ఇచ్చము అంటూనే స్వేచ్చకు మన నిర్వచనాలు జోడిస్తాము.

అనేకమైన కారణాలలో కొన్ని

౧. భార్యను బానిసగా చూడటం – ఇందులో నేను లేను అనే అనుకుంటున్నాను, నా శ్రీమతి చెప్పాలి.

౨. విరహం – అన్నిసార్లు నిజం కాదేమో

౩. శ్రీమతికి దొరికిన కారణాలు మనకు ఆమెను ఆపడానికి దొరకవు అనే కారణం – ఇది చాలా నిజం నా వరకు

౪. ఒక్కోసారి అర్ధ నారీశ్వర అని అనుకుని మనం తనకోసం enjoyment దూరం చేసుకుని, తను వచ్చే వరకూ వేచి ఉంటాం అనే భయం ఏమో.

 

ఇక భార్యా భర్తల గొడవ పక్కన పెడితే జాతీయ గొడవలు

ముంబాయిలో వర్షాలు – నాయకుల ప్రయత్నాల మీద బురద నీళ్ళు

అర్ధం కాలేదా, ముంబాయిలో వర్షాలు పడ్డాయి, వెంటనే నాయకుల మీద కొందరి మాటల తూటాలు, ఉదాహరణకు ఎవరో selfie campaign పదులు ముంబాయిని పట్టించుకోవాలి అన్నారు, వాళ్ళు అన్నాది తప్పు లేదు కానీ, వాళ్ళు వదిలి పెడుతున్న వ్యర్ధాల గురించి ఆలోచిస్తున్నారా అలోచింపజేస్తున్నారా?

అసలు కారణం ఎమిటి అని ఆలోచించారా?

నాకు అర్ధం అయిన కారణాలు

౧. విపరీతంగా పెరిగిపొతున్న కట్టడాలు – ప్రజల తప్పు ప్రభుత్వాల తప్పు ఉంది

౨. గోదావరి మీద ఆనకట్టలు – దీని వల్ల మాహారాష్ట్రలో పడ్డ వాన నీరు లోతట్టు ప్రాంతానికి చేరదు ముంబాయిలో నీరు బయటకు పోదు – ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తప్పు

౩. అతిగా ఉపయొగిస్తున్న సౌందర్య సాధనాలు – వీటి వ్యర్ధాలు కలుషిత నీరు వెళ్ళే దారులకు అడ్డం పడతాయి – ఇక్కడా ప్రజలు ప్రభుత్వాల తప్పు ఉంది

ఇక ఇంకో జాతీయ గొడవ, కానేకాదు ఒకరిద్దరి తప్పులు ప్రజాసమస్యలు పక్కద్రోవ, అదే Lalit Modi సమస్య . ప్రజల సమస్యలు ప్రక్కన పెట్టి వీడిగురించే మాట్లాడటం.

 

ఇక అతి ముఖ్యమైన సమస్య ౨౪ గంటల వార్తలు , ఇది అబద్దం మధ్యాన్నం భొజన సమయంలో గత నెలరోజులుగా ఒక్కటే వార్త Lalit Modi Visa, మధ్యలో వ్యాపం వచ్చింది పోయింది!

అటు నాయకులకూ ప్రజా సమస్యలు పట్టట్లేదు ఇక్కడ కొన్ని వార్తా సంస్థలకు ప్రజా సమస్యలు అసలు సమస్యలు కాదు అనే అభిప్రాయం!

 

ధనం మూలం ఇదం జగత్!

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.