01 -సూర్యుడిని నడిపేది ఏది ?అతని ఎవరు అనుసరిస్తున్నారు ?అతడు ఎందుకు అస్తమిస్తాడు ?అతనికి ఆధారం ఏమిటి ?
సమాధానం -సూరుడిని బ్రహ్మ నడి పిస్తాడు .దేవతలు సూర్యుని అనుసరిస్తారు .ధర్మం వల్లనే భాస్కరుడు అస్త మిస్తున్నాడు .అతనికి ఆధారం సత్యమే .
02 –పురుషుడు ఎందుకని శ్రోత్రియుడుఅవుతాడు ? ఎందు వల్ల మహిమ ఎక్కు వవుతుంది ?దేని వల్ల సహాయం లభిస్తోంది .ఎందు వల్ల బుద్ధి మంతుడు అనే పేరు వస్తోంది?
సమాధానం –వేదాధ్యయనం వల్లనే శ్రోత్రియుడు అవుతున్నాడు .మంచి తపస్సు వల్లే మహిమ పెరుగు తుంది .కేవలం ధైర్యం వల్లే మానవుడు సహాయ సంపన్నుడు అవుతున్నాడు .విద్వజ్జనులను సేవించటం వల్లే బుద్ధి మంతు డవుతాడు
03 –బ్రాహ్మణుడికి ఎందు వల్ల దేవత్వం కలుగు తుంది .అతనికి సాధువు ,అసాద్ధువు ,మానుషత్వము వేటి వల్ల కలుగు తాయి ?
సమాధానం –వేదాధ్యయనం వల్లే బ్రాహ్మణుడు అవుతాడు .ఎక్కువ గా వ్రతాచారణం వల్ల సాధుత్వము ,వ్రతం చేయక పొతే అసాదుత్వము ,శుభ్రత లేక పోవటం వల్ల కలిగే మృత్యు భయం వల్ల మానుషత్వము కలుగు తాయి .
04 –జీవన్మృతుడు అంటే ఎలాంటి వాడు ?
జవాబు –దేవతలను ,అతిధులను ,సేవకులను కాదని తాను ఒక్కడే భుజించే వాడు జీవన్మృతుడు .
05 –భూమి కంటే బరువుగా వుండి ,మహత్తరమైనది ఏది ?ఆకాశం కంటే పొడవైనది ఏది ?గాలికంటే వేగం కలది ఏది ?గడ్డి కంటే చివికి జీర్ణ మయేది ఏది ?
జవాబు –తల్లి -భూమి కంటే బరువై మహత్తర మయింది .తండ్రి ఆకాశం కంటే పొడవైన వాడు .గాలి కంటే మనసు వేగ వంత మైనది .గడ్డి కంటే చింత తో ఉన్న మనసు చివికి జీర్ణ మయేది .
06 -నిద్రించినా కన్ను మూయనిది ఏది ?జన్మించినా చైతన్యం లేనిదేది ?రూపం వున్నా ,హృదయం లేనిదేమిటి ?వేగం వల్లే కోన సాగేది ఏది ?
జవాబు –చేప నిద్రించినా కన్ను మూయదు .జన్మించినా అండం (గుడ్డు )చైతన్యం లేనిదే .రాతికి రూపం వున్నా హృదయం లేదు .
07 -ప్రయాణించే వారికి ,రోగం తో ఉన్న వాడికి ,గృహస్తు కు ,మరణించిన వాడికి చుట్టాలు ఎవరు ?
జవాబు –ప్రయాణీకుడికి అధ్వరులు మిత్రులు .రోగం ఉన్న వాడికి వైద్యుడు ,గృహస్తునికి మంచి భార్య ,మరణించిన వాడికి చేసిన ధర్మమూ బంధువులు .
08 –ధర్మానికి కీర్తికి ఏది ఆధారము ?స్వర్గానికి మార్గం ఏది ?సుఖాలకు ఏది ఆధారం ?
జవాబు -ధర్మానికి ,దాక్షిణ్యం ఆధారం .కీర్తికి మహిమ ఆశ్రయం .దానం తో కూడిన సత్యం స్వర్గానికి మార్గం .సుఖానికి సౌశీల్యం ఆధారం .
09 –నరునికి ఆత్మ ఎవరు ?అతనికి దైవిక మైన బందువేవరు ?మానవుని మనుగడ దేని వల్ల కొన సాగుతోంది ?మానవుడు ఇతరముల కంటే ఎందు వల్ల అధికుడు ?
జవాబు –కొడుకే మనిషి ఆత్మ .భార్య దైవిక మైన చుట్టం .పర్జన్యుడి (మేఘుడు ) వల్ల మనుష్యుని జీవితం సాగి పోతుంది .వితరణ వల్ల ,మనిషి ఇతరుల కంటే అధికుడు
10 –లోకం లో గొప్ప ధర్మం ఏమిటి ?ఎప్పుడూ పరిణతి తో వుండేది ఏది ?ఆనందం పెరగాలంటే దేన్నీ నిగ్రహించుకోవాలి ?ఎవ్వరి తో సంధి చెడి పోదు ?
జవాబు –అహింస అన్ని ధర్మాల కంటే ఉత్తమం .యోగ కర్మ ఎప్పుడు పరిణతి చెంది ,మంచి ఫలితం ఇస్తుంది .మనసు లోని అహంకారాన్ని నిర్మూలించుకొంటే ,పరమానందం తప్పక కలుగు తుంది .మంచి వారి తో ఏర్పరచుకొన్న స్నేహం ఎప్పుడు చెడి పోదు .
11 -లోకానికిదిక్కు ఏది ?అన్న పానాదులు వేటి వల్ల పుడుతాయి ?ఏది విషం ?శ్రాద్ధ విధికి తగిన సమయం ఏది ?
జవాబు –సత్పురుషులే లోకానికి అంతటికి దిక్కు .ఆకాశము , భూమి లే అన్న ,పానాదులకు ముఖ్య కారణం .బ్రాహ్మణుల డబ్బు విషం .బ్రాహ్మలు వచ్చిన సమయమే శ్రాద్ధ విధికి అనువైన సమయం .
12 -పురుషుడు అంటే ఎవరు ?ఎటు వంటి వాడు ?అందరి కంటే ధన వంతుడు ఎవరు ?
జవాబు –ఎవరి సత్కీర్తి భూమి ,స్వర్గ లోకాల్లో నిరాఘాటం గా వ్యాపిస్తుందో అలాంటి వాడే పురుషుడు అని ఆర్యుల అభి ప్రాయం .ప్రియం ,అప్రియం ,సుఖ దుఖాలు ,భూత భవిష్యత్తులు ,సమానం గా చూసే మహాత్ముడే అందరి కంటే ధన వంతుడు ..
mahabharthamlow arjune vejayamu gurenchi maku samadhanam kavali
నేను ఇంకా చదవలేదు