జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దినేష్ త్రివేది గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఛార్జీలు పెంచి రు. 36,200 కోట్లు అదనంగా ఈ సంవత్సరం ఆదాయం పెంచబోతున్నట్లు ఆయన ప్రకటించాడు. అంత పెద్ద మొత్తం లో ఛార్జీలు వడ్డించి కూడా తాను చాలా తక్కువ పెంచానని ప్రకటించాడు. పైగా సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకుని ఛార్జీలు పెంచానని చెప్పడానికి కూడా సాహసించాడు. ఛార్జీలు పెంచి ఐ.సి.యు లో ఉన్న రైల్వేలను బైటికి తెచ్చానని గొప్పలు చెప్పుకున్నాడు. రైల్వేలను ఐ.సి.యు లోకి చేర్చిందెవరో కూడా ఆయన చెప్పి ఉంటే బాగుండేది. చెప్పినా, చెప్పకపోయినా, ఆయనకి ముందు మూడు సంవత్సరాలు రైల్వే మంత్రిత్వ శాఖ నడిపిన మమతా బెనర్జీ యే రైల్వేలను ఐ.సి.యు లో చేర్చిందని ప్రజలు అర్ధం చేసుకున్నారు.
రైల్వే బడ్జెట్ ప్రసంగం ముగిశాక అనూహ్యంగా మమతా నుండి కేంద్ర ప్రభుత్వానికి తాఖీదు అందింది. రైల్వే ఛార్జీల పెంపుదలను తమ పార్టీ వ్యతిరేకిస్తున్నదనీ, వెంటనే పెంచిన ఛార్జీలను వెనక్కి తీసుకోవాలనీ ఆ తాఖీదు సారాంశం. ప్రజలపై భారం వేసే చర్యలను తాము అంగీకరించేది లేదని ఓ గంభీరమైన విధాన ప్రకటన కూడా ఈ సందర్భంగా ఆమె చేసింది. మరి కొన్ని గంటల తర్వాత దినేష్ త్రివేదిని రైల్వే మంత్రిగా తప్పించి ముకుల్ రాయ్ ని నియమించాలని కూడా ఆమె సూచించినట్లు వార్తలు వచ్చాయి.
దినేష్ త్రివేది చేత రాజీనామా చేయించి మరొకరిని…
అసలు టపాను చూడండి 484 more words