నిజంగా వద్దు మనకు facebook
దీని వల్ల జరుగుతున్న నష్టాలు
మొత్తం Advertisements అన్నీ Dollar లాగా మారుతున్నాయి, అంటే Dollar ఇంకా శక్తివంతమౌతుంది.
నాకు జరుగుతున్న నష్టం ఏమీ లేదు, నేను బాగానే బ్రతుకుతున్నాను కదా అనుకుంటున్నారేమో
మనం నష్టపొతున్నావి Dollar ధర పెరగడం వల్ల petrol ధరలు, Pesticides ఎరువులు ఇలాంటి వాటి ధర పెరుగుతున్నాయి. మన డబ్బులు వెళ్ళడం తప్ప మనకి వస్తున్నది ఏమీ లేదు. అందుకే say no to facebook. మన దేశం కోసం మనం మాట్లాడుకుంటుంటే పక్కింటి వాడు లాభ పడు తున్నాడు.
ప్రసాద్ గారూ,
మీరు ఫేస్ బుక్ ను డాలర్లు అమెరికా వెళతాయి కాబట్టి , వద్దు అన్నారు.
మీ వాదన నిజమే కానీ మీ సలహా ( say no to facebook ) మాత్రం సమంజసం గా లేదు.
ఎందుకంటే ప్రపంచం లో అత్యంత ధనవంతులలో ఒకడైన బిల్ గేట్స్ తన సంపాదనలో అక్షరాలా యాభై శాతం ప్రజా హిత కార్యక్రమాలకు దానం చేస్తున్నాడు.
ఆయన సహాయం అందుకునే దేశాలలో మన భారత దేశం కూడా ముఖ్యమైనది.అలాగే అతి చిన్న వయసు వాడయిన ఫేస్ బుక్ స్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ కూడా తప్పకుండా తన సంపాదనలో అధిక మొత్తాన్ని ప్రజా హితానికి ఇస్తాడు.బిల్ గేట్స్ తన సహాయాన్ని డాలర్ల లో నే చేస్తున్నాడు.
అట్లాంటి విదేశీయులు, మన దేశాన్ని , మన దేశం భూమినీ, ఖనిజ వనరులనూ దోచుకుని , ప్రజలను జలగల్లా తర తరాలూ పీల్చి , పీక్కు తినే ‘ మన వాళ్ళ ‘ కన్నా అనేక లక్షల రెట్లు నయం కదా !