ఎలా మొదలుపెట్టాలో తెలియట్లేదు కానీ నా అభిప్రాయాలు మాత్రం చెబుతున్నాను.
ఒక్కోసారి డబ్బులు తీసుకు వెళ్ళి Stock Markets ఇంకొన్ని సార్లు Life Insurance ఇంకొన్ని సార్లు Mutual funds లో పెడదాము అనిస్పిస్తుంది, ఎందుకు అంటే ధన దాహం ఒక్క రోజులో వందలు వేలు వస్తుంటే తీసుకు వెళ్ళి Fixed deposit ఎందుకు చెయ్యాలి?
ఇదే కాదు Fixed Deposit చెయ్యకపోవడానికి అనేక కారణాలు
౧. లక్ష రూపాయలు పైన Fixed Deposit చేస్తే దాని మీద వచ్చే interest పైన మనం పన్ను చెల్లించాలి
౨. Banks మనం దాచుకున్న డబ్బులు రైతులకు రుణాలు క్రింద ఇస్తాయి, అంటే మన సొమ్ముకు నమ్మకం లేదు.
౩. దాని మీద వచ్చే వడ్డీ సంవత్సరానికి చాలా తక్కువ అదే Shares అయితే అమ్మో నిజమే
౪. మొన్న ౨౦౦౭ -౨౦౦౮ inflation లో ICICI Bank చేసిన విదేశీ Investments చాలా మొత్తం పోయాయి అదే కాకుండా GTB లాంటివి ఇంకా ఎన్ని జరుగుతాయో అని.
కానీ అప్పుడప్పుడు నాకు నేను నిశ్చయించుకోలేని విషాయాలు ఇవి.అందుకే నేను నిశ్చయించుకున్నాది
ఏది ఎమైనా నేను FD మాత్రమే చెద్దాము అనుకుంటున్నాను, మరి పైన చెప్పిన విషాయాలు అంటారా?
ఏమి చెయ్యగలను నేను బ్రతడానికి మాత్రమే తిందాము అనుకుంటున్నాను మనది కాని సొమ్ము మన దగ్గర ఉండదు అన్నది మాత్రం నిజం. ఇంకా కొన్ని విషయాలు మానవతా దృక్పదంతో
మనం FD’s Public sector banks(State bank of India and State bank group and Andra bank) లో చెస్తే ఎంతోకొంత రైతులకు చేరుతుంది అని నా అభిప్రాయం.
ఇది ఎందుకు వ్రాసాను అని అనుకుంటున్నారేమో
నేను ఇది చెప్పాలి అనుకున్నాను అంతే, ఇవేకాదు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి అవన్నీ తరువాత తరువాత టపాలలో తెలుపుతాను.