నేను కాదురా మీరు ౧౯౯౦ ముందు మనుషులు

నేను నా ప్రపంచానికి రాసిన ఉత్తరాలలో చాలా సార్లు వ్రాసాను, ఒక్కడిని ధనవంతుడిని చెయ్యడానికి అందరూ కష్టపడుతున్నాము అని.

స్వాతంత్రానికి మునుపు మన ధనం వాళ్ళ అవసరాలకు భోగాలకు వాడుకుంటున్నారు అని వాళ్ళని తరిమి తరిమి కొట్టాము. మరి ఇప్పుడు?

చేస్తున్నది మనవాడే కాబట్టి పరవాలేదా?

ఇకపోతే ఉద్యోగాలు వచ్చాయి అని సంబర పడిపోతున్న ఈ quid pro quo గాళ్ళకి నేను చెప్పీది, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళ ఆస్తి పెంచుకోవడానికి మాత్రమే, ఎలాగా అంటారా?

అందరి అభిమాన నటుడు YSR గురుంచి తెలుసుకుందాము,

ఆయన అధికారమలోకి రాగానే వర్షాలు పడ్డాయి అని, మంచికి మళ్ళీ రోజులు వచ్చాయి అని ఆనంద పడ్డారు – నిజానికి ఆయన రాగానే ప్రజాస్వామ్యం పునాదులు పీకేసారు. ఎలాగా అంతే Sonia Gandhi జాగీరులా మారారు – కాలంతో పాటు ధనం వచ్చే సరికి Sonia కి ఎదురు తిరిగారు, అంతే అప్పటివరకు తన కోసం ఉన్న కుక్క ఎదురుతిరిగితే యజమానికి కోపం రాదా అదే జరిగింది, నిజంగా అతనిని నాయకత్వం నుంచీ తప్పించాలి అనుకుంది(నిజానికి PV Narasimha Rao కూడా అదే జరిగింది – అది ఇప్పుడు అప్రస్తుతం ఎందుకంటే అతను మంచి కోసం చేసాడు), దాంతో వ్యూహ ప్రతివూహాలు ఎన్నో బెడిసి కొట్టాయి. మరి ఈ పసుపు పచ్చపత్రికల వాళ్ళ కధనం ప్రకారం చంపించింది అని అది నాకు తెలియదు నిజం అవ్వచ్చు కాక పోవచ్చు “నిజం ఆ దైవానికే తెలుసు”.

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం, ప్రతీ అడుగు వాళ్ళని ధనవంతులను చెయ్యడానికే అని నిరూపించడానికి నా దగ్గర ఆధారాలకి కొదవ లేదు

జనాలకి ఉపాధి పధకం ప్రవేశ పెట్టాడు, డబ్బులు వచ్చాకా ఎవడైనా తిన్నంగా ఉంటాడా మందు బాబులవుతారు లేక పొతే ఇళ్ళు కట్టు కోవాలి అనుకుంటారు. మరి మందు బాబుఅల వల్ల YSR కి కించిత్ లాభం కూడా లేదు అందుకు ఇందిరా గృహాలు అని పేదలకు ఇళ్ళు కట్టిస్తాను అన్నాడు, అందరూ చప్పట్లు కొట్టారు, మరి ఇక్కడే ఉండి మెలిక కొంత మీరు పెట్టుకోవాలి కొంత ప్రభుత్వం పెట్టుకుంటుంది అన్నాడు మరి అవసరమైన Cement/ఇనుము ఎక్కడ పక్క రాష్ట్రాల నుంచీ లేదా ఇప్పుడు ఉన్న సంస్థల నుంచీ కోనేస్తారో మళ్ళీ నా కొడుక్కి ఏమీ మిగలదు అనుకున్నాడో ఏమో వెంటనే కొడుకు పేరుమీద Bharathi cement industry కి పునాదులు వేయించాడు, మరి ఇప్పుడు నీళ్ళు కావాలి ఎలాగ?

అప్పుడు గుర్తుకు వచ్చింది శ్రీబాగ్‌_ఒడంబడిక వెంటనే అమలు చేసాడు, మొత్తం నీళ్ళు తన కొడుకు industry కి వెళ్లడం మొదలు పెట్టాయి. మరి ఇళ్ళు కట్టుకున్నాకా Current line వేయించు కోకుండా ఉంటామా, మళ్ళీ ఆ కొడుకుకు ఎక్కడ డబ్బులు రావో అని Power generation grids కి పునాదులు వేసాడు.

మరి ఇన్ని తప్పులు కనిపించకుండా ఉండటానికి తన పత్రిక “సాక్షి” స్థాపించుకున్నాడు.

ఇంకా ఇవే కాకుండా ఈ తప్పులను చూపించి తన మీద ఎక్కడ స్వపక్షం వాళ్ళు దూకుటారో అని coastal carridar అన్నాడు. దాని కోసం సాగు భూములను బీడు భూములు చేసేసాడు.దాన్ని ఈ పసుపు పచ్చ పత్రికలు industrialization అంటాయి. మరి అక్కడ కూలి వాళ్ళ లాగా మారిన రైతుల పరిస్థితి ఏమిటి? పర్యావరణం పరిస్థితి ఏమిటి?  ఎన్ని ఉద్యోగాలు వచ్చాయో గుండెల మీద చెయ్యి వేసుకుని సంపాదకీయం వ్రాయరు.

డబ్బు ప్రపంచం డాబు ప్రపంచం ఇంతే.

ఇంత జరిగినా వాళ్ళని ఎలా సమర్ధిస్తారు?

నేను కాదురా మీరు ౧౯౯౦ ముందు మనుషులు

3 thoughts on “నేను కాదురా మీరు ౧౯౯౦ ముందు మనుషులు

 1. ashok అంటున్నారు:

  Dabbuleni vadu illu kattukovadam, mandu tagadam okela kanipistunnaya neeku? Bharathi cement bag cost teslusa neeku? Indiramm illaki vade cement emito teslusa? Aaslu Indiramm illaki Cement Govt suplly cheyyadu. Govt dabbulu iste, vallu konukkuntaru. USA lo per head POWER usage entho telusa? India lo Power projects pedite tappa? Indai per head usage USA lo 80 times takkuva. as per Sreports, india in power problems more than 2000Giga wats till now.

  1. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు అంటున్నారు:

   నిజమే, నేను అడిగిన ప్రశ్నలు అవికాదు
   ౧. పావలాకి దొరికే వస్తువు ౨ రూపాయల్కు అమ్మితే ఎవరికి కోపం రాదు
   ౨. ప్రకృతి సంపదను తన సంపదలాగా అమ్ముకోవడం గురించి నేను మాట్లాడాను
   ౩. నేను అసలు USA గురించి ఎక్కడ మాట్లాడాను అయినా అక్కడ ఈ విధమైన Industrialisation వల్ల డబ్బులు మొత్తం ఒకడి చేతులలోకి వెళ్ళి పోయాయి.
   ౪. ఇంకికడు తప్పు చేసాడు కాబట్టి నేను చేస్తే అది తప్పు కాదా మొదటి నుంచీ మీ వర్గం అనుసరిస్తున్న విధానం ఇదే కదా

   అన్నిటికన్న ముఖ్యమైన విషయం కృష్ణా ఎత్తి పొతలు రాయలసీమ దాహార్తి తీర్చడానికి కాదు, నిజానికి Cement Industry coolent లో ఉపయోగించడానికి.

  2. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు అంటున్నారు:

   ఇక మీ రెండవ ప్రశ్న భారతదేశంలో power problems చాలా ఉన్నాయి అని, అలాగైతే అడవులు చెట్లు నరికి గాలి లేకుండా చేసేస్తే power వస్తుంది కానీ గాలిలో oxygen. ఇదే కాకుండా ఇప్పటికీ Government solar panels ఎందుకు promote చెయ్యట్లేదు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.