నిజం నిజం నిజం
మిత్రులకు నమస్కారం,
మాది ఒక చిన్న పల్లెటూరు, నా చిన్నప్పుడు మా ఊరి పొలాల్లోకి ఎటు చూసిన పచ్చటి మాగాణి పొలాలు కనిపించేవి. మాది ప్రకాశం జిల్లా గొప్ప చరిత్ర కలిగిన కృష్ణా డెల్టా చివరి భూములు, అంటే మా తరువాత మిగిలిన నీరు సముద్రంలో కలుస్తాయి అనమాట(అది నేనెప్పుడు చూడలేదు). మాకు నాగార్జునసాగర్ కుడి కలువ నుంచి వచ్చే నీటిని చివరగా వాడుకుంటాము, కొంత భూమి ప్రకాశం బేరేజి కుడి కాలువ నుంచి వచ్చే నీటితో ఒక పంట పండించే భూములు మావి. అది పాతిక సంవస్తరాల క్రిందటి మాట, కాని ఇప్పుడు వచ్చే అరకొర నీటితో ఒకప్పటి మగాని భూముల్లో మెట్ట పంటలు సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నాము.
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2004లో 1/06/2004న విడుదలైన G.O – 53 మరియు 2005లో 11/01/2005న G.O – 5, 2/03/2005న G.O – 108 జారీ చేసింది ప్రభుత్వం. ఈ G.O లు ఏమిటి ఎందుకు అనుకుంటున్నారా, అది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సంభందించినవి. దీనివల్ల కడపలో లక్షన్నర ఎకరాలు, చిత్తూరులో లక్ష ఎకరాలు మరియు నెల్లూరులో 15వందల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి అని అధికారిక లెక్కలు. ఇంతవరకు అంత బాగానే వుంది. మరి నీరు ఎక్కడనుంచి ఇస్తారు అని చూస్తే శ్రీశైలం డ్యామ్ లో నిండగా వచ్చే నీరుని ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ జిల్లాలకు తరలిస్తారు. అంటే…
అసలు టపాను చూడండి 342 more words