శరీర భాష / Body language
భావాన్ని వ్యక్తం చేయడానికి భాష కావాలి, అది నోటి ద్వారా చేసేపని. శరీరం మాట్లాడుతుంది, దానికీ భావం వ్యక్తం చేసే అలవాటుందనీ చెబుతారు. నిజమే దీనికి ఆద్యులం మనమే. ప్రతిదానికి మనమే అద్యులం అంటారు, దీనిని అభివృద్ధి చేసిన వారు పశ్చిమ దేశాలవారు అంటున్నారు. మనం చాలా విషయాలని వదులుకున్నాం,వదులుకుంటున్నాం, అందులో ఇది కూడా ఒకటి. శరీర భాష గురించి ఒకటి రెండు సంగతులు, రెండు చేతులు వేళ్ళతో సహా కలిపి హృదయం దగ్గరుంచితే నమస్కారం, రెండు చేతులూ పైకెత్తి నమస్కారంగా చూపితే తిరస్కారంతో కూడిన నమస్కారం. చెయ్యి చాచి వేళ్ళు వంచి వెనక ముందుకు ఆడిస్తే రమ్మని అర్ధం. అదే చేతిని చాచి చూపుడు వేలు చూపితే, లేదా చెయ్యి చూపితే పొమ్మని అర్ధం. ఒక చెయ్యికాని రెండు చేతులూ వెలపలికి లోపలికి ఊపితే లేదని అర్ధం. తల ఊపడం లో కూడా ఇష్టాయిష్టాలు తెలిపేసావకాశం. తల కుడి ఎడమపక్కలకి వాలుస్తూ ఉంటే ఇష్టం, తల తిన్నగా ఉంచి ఎడమ, కుడిపక్కలకి తిప్పితే అయిష్టం. రెండు చేతులతో ఎదుటివారిని కౌగలించుకుంటే ఆప్యాయతను పంచుకుంటున్నట్లు అర్ధం. చూపులోనే నానార్ధాలు చూపగలగడం స్త్రీల ప్రత్యేక లక్షణం. పురస్కారం నుంచి తిరస్కారం దాకా, ప్రేమ నుంచి ద్వేషం దాకా. మోకాలడ్డుపెట్టడం అంటారు, అంటే ఆ పనిని అడ్డుకుంటున్నట్లట. పెదవులతో చేసే విన్యాసం చెప్పడం ప్రారంభిస్తే అదొక గ్రంధమే అవుతుంది…
అసలు టపాను చూడండి 269 more words