ఇన్ని మరచిపోయాము ——- వీటి విత్తనాలు ఇప్పటికాలంలో దొరుకుతాయో
ఏకవింశతి పత్రాణి 300th post
వినాయకనవరాత్ర శుభకామనలు .అయిపోయిన పెళ్ళికి బాజాలా, పండగెళ్ళి న తరవాతేమిటి అనద్దు. చవితి మొదలుకొని నవరాత్రులు పూజిస్తాం. పూజలో ఉపయోగించే పత్రాలు ఇరువది ఒకటి అని చెబుతాం. ఇందులో ప్రాంతాల్ని బట్టి కొన్ని మార్పులున్నట్లు కనపడుతూ ఉంది. నేను చెబుతున్న పత్రాలు ఎక్కువ మంది వాడకంలో ఉన్నవి వాటికి తెనుగు పేర్లు. మొన్న సునీత గారు నన్ను కొన్ని పత్రాలకి తెనుగు పేర్లడిగేరు, వెంఠనే తెలీదని చెప్పేసేను, కాని ఏదో వెలితి కనపడింది. అయ్యో! చెప్పలేకపోయామే, అని. అదీకాక ప్రతి సారి పూజ చేసేటపుడు పత్రం పేరు చదవడం అది లేక మరొకటి పూజ చెయ్యడం జరిగిపోతూ ఉంది. సునీతగారడిగిన తరవాత అసలు మనకు ఎన్ని దొరుకుతున్నాయో చూడాలనిపించి మొదలెట్టి పత్రి సేకరించడం చేస్తే, నాకు మొత్తం దొరకనివి ఏడు. అందులో రెండు ప్రయత్నిస్తే దొరుకుతాయి, మిగిలిన ఐదూ కష్టపడినా దగ్గరలో దొరికే సావకాశం లేదు. విచిత్రమేమంటే ఇందులోని మాకు దొరికే పదునాల్గు పత్రాలూ మా చుట్టుపక్కలే ఉన్నాయి. మాకు దొరకనివి, వాకుడు,మఱ్ఱి,దేవదారు,వావిలి, మద్ది. ప్రయత్నం మీద దొరికేవి, మరువం,దేవకాంచనం (గండకీ పత్రం). తులసితో ఇప్పుడు మాత్రమే గణపతిని…
అసలు టపాను చూడండి 951 more words