ఏనుగుల పుట – ఈ రోజు నా ఆహారం మనుషులు నరికి తీసుకు వెళ్ళిపోయారు, నా తమ్ముడిని దంతాల కోసం వధించారు
చిరుత పులుల పుట – నా సహోదరులను చర్మం కోసం వధించారు, నేను అఙ్నాతం లోకి వెళ్ళి పోయాను.
పులి – నేను ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే జింకను వేటాడితే మనుషులు మాత్రం తమకు ఆకలి తీరడానికి ఎన్ని ఉన్నా జింకలను తింటూ నాకు ఆహారం దొరక్కుండా చేస్తున్నారు.
కోడి పెట్ట – జీవితాంతం నేను కోళ్ళ చావిట్లో గుడ్లు పెడుతూనే ఉండాలి, నా అశుద్ధం నుంచీ వచ్చే దుర్వాసన భరిస్తూనే ఉండాలి
కోడి పుంజు – నన్ను చంపడం తప్ప ఈ మానవ జాతికి ఏమి తెలుసు, కోడి పందాలలో నేను నగ్గితే వాళ్ళు మీసం ఎందుకు మేలేస్తారో అర్ధం కాదు.
వరాహం – కోడి పుంజు జీవితం కనీసం నయం నాది ఇంకా దయనీయం చంపడానికి మాత్రమే అన్నట్టు
ఆవు – నేను ఇచ్చిన పాలు వల్ల వంద మందికి మంచి జరుగుతున్నా మనిషి జిహ్వాచాపల్యం వల్ల ౧౫ ౨౦ మంది కోసం బలవుతున్నాను.