పోలిక.
పోలిక చెప్పడం అన్నది పుట్టిన రోజునే ప్రారంభమవుతుందనుకుంటా. పుట్టిన బిడ్డ ఎర్రగా ఉందా, నల్లగా ఉందా దగ్గరనుంచి, కనుముక్కు తీరుని పోల్చేస్తారు, తల్లి, తండ్రి, అత్త, మామ, మామ్మ, తాత, అమ్మమ్మ, తాత వగైరాలతో. అదీగాక మనకో సామెత కూడా ఉంది “మేనమామ పోలిక మేనత్త చారిక” అని, ఒకరు తల్లి వైపువారు, మరొకరు తండ్రి వైపువారు. ఇంతే కాక దాని సమర్ధిస్తూ అమ్మాయికి మేనత్త పోలిక, అబ్బాయికి మేనమామ పోలిక, అమ్మాయికి తండ్రి పోలిక, అబ్బాయికి తల్లి పోలిక మంచిదంటారు. ఇదీగాక బుద్ధులలో, అలవాట్లలో పోలికలు చెబుతారు. మనకి ఈ సందర్భంగా రామాయణం లో ఒక సంగతి గుర్తొచ్చింది, చూడండి. కైక కోరిక ప్రకారం, దశరధుని ఆజ్ఞపై రాముడు అడవులకు వెళుతున్న సందర్భంలో దశరధుని రధసారధి సుమంత్రుడు కైకను నీకు తల్లిపోలిక వచ్చిందంటాడు. నీ తల్లి కూడా నీలాగే మీనాన్నని ఆపదలపాలు చేయబోయిందని దెప్పుతాడు.అదేమో చూద్దాం.
అభిజాతం హితే మన్యే యధా మాతు స్తధైవచ
న హి నింబాత్ స్రవేత్ క్షౌద్రం లోకే నిగదితం వచః….రామా.. అయోధ్య…సర్గ.35..శ్లో..17
వేపచెట్టునుంచి తేనె కారదు అట్లే నీ తల్లి స్వభావమే నీకునూ వచ్చింది అన్నాడు. మీ తల్లి మూర్ఖపు పట్టుదలగూర్చి మేము ఇదివరకే ఎరుగుదుము. ఒక యోగి మీతండ్రికి పశుపక్ష్యాది జంతువుల అరపులు, వాటి భావం తెలియగల వరం ప్రసాదించాడు. ఒకనాడు మీ తండ్రి తన పాన్పు దగ్గరలో ఒక జంట పక్షులు…
అసలు టపాను చూడండి 392 more words