Courtesy google
నమక, చమక సహిత మహన్యాసం, వినండి. నేను మహన్యాసం విన్నంతలో, ఇంత గొప్ప శృతిలో కమనీయంగా పారాయణ చేసినవారు కనబడలేదు. చాలా కాలం నుంచి ఈ పారాయణ వింటున్నాను, కాని ఎవరు పారాయణ చేసేరో తెలియలేదు.
పని కట్టుకుని వెతికి పట్టుకున్నా. .మన కోసం ఒక గంటన్నర సేపు పారాయణ చేసినవారు కొత్తగూడెం వాస్తవ్యులు శ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి గారని తెలిసింది. దీనిని యూ ట్యూబ్ లో పెట్టినవారు శ్రీ కొత్త చంద్ర గారికి అభినందనలు. శ్రీ శాస్త్రి గారికి సాష్టాంగ నమస్కారం, వీరిపుడు అమెరికాలో ఉన్నారు..శివరాత్రి పూటా ఏమీ చేయలేకపోయినా శ్రద్ధగా వినండి, మీ పని చేసుకుంటూనయినా సరే!. శివుడు భక్త సులభుడు, బోళా శంకరుడు కాసిని నీళ్ళు నోటితో పట్టుకొచ్చి, పుక్కిలించి ఉమ్మేసిన వాడికీ , మేకపెంటికలో, స్త్రీ కుచంలో శివుణ్ణి దర్శించినవారికీ కైవల్యం ప్రసాదించినవాడు.
పద్మావతీ సహిత వేంకన్నను దర్శించుకుని నారాయణీ సహిత శ్రీకాళహిస్తీశ్వరుణ్ణి దర్శించుకుని వచ్చిన తరవాత కూడా మా వాళ్ళకి సరిపడలేదు. ఊళ్ళో గుడిలో ప్రతి సంవత్సరం చేసే లక్షపత్రి పూజ ఏదాశ రుద్రాభిషేకం మార్చ్ మూడున పెట్టేం రమ్మన్నారు. (03.03.2013) చేసేపని లేదుగా, ఇల్లాలితో బయలుదేరివెళ్ళేను. ఉదయం నుంచి గుళ్ళో అన్నీ కార్యక్రమాలే.
నమక చమక సహిత మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, చమక ఫాఠం ఒక సారి చెప్పి నమకం పదకొండు సార్లు చెప్పి అభిషేకం చేయడం. ఆ…
అసలు టపాను చూడండి 270 more words