Courtesy you tube
mithunam పై క్లిక్ చేసి కధ చదవండి.(బాపు గారి స్వదస్తూరితో)
Courtesy C.V.L.N.Ravi kumar
మిథునం అద్భుతః
“మిథునం సినిమా చూడు బాబాయ్” అన్నాడు, అబ్బాయి,ముంబాయి నుంచి. “ఏదిరా! చూదామని కూచుంటే కరంటు వాడికి కన్ను కుట్టిం”దంటే మర్నాడు బ్లాగ్ లో పెట్టేసేరు జిలేబి గారు. ఇల్లాలితో కలిసి చూశా, “సంబడమే, బానే ఉంది, మీ నిరవాకమే” అంది ఇల్లాలు. నిన్న అబ్బాయి పిలిచి “బాబాయ్! సినిమా చూశావా?” అన్నాడు. “చూశానయ్యా!” అంటే “ఎలా ఉంద”న్నాడు “అద్భుతః” అన్నా, గలగలా నవ్వేడు. అప్పుడన్నాడు “బాబాయ్! బాపూ గారు స్వహస్తాలతో రాసిన కధని స్కేన్ చేసి దాచుకున్నా,” అన్నాడు.నాకు ఆనందంతో నోట మాట రాలా. మన సంస్కృతిని తరవాత తరాలు జాగ్రత్తగానే చూస్తున్నాయని ఆనందమయ్యింది. “ఒరే అబ్బాయ్! నాకు పంపవురా” అన్నా. “చూసి పంపుతానేం” అన్నాడు. భోజనం చేస్తోంటే కోడలు సెల్ ఫోన్ తెచ్చి ఇచ్చింది, “బావగారి దగ్గరనుంచి” అని. “బాబాయ్! పంపేను చూడు” అన్నాడు. అక్కడినుంచి ప్రారంభమయ్యింది నా ఆరాటం. రెండు మెతుకులు కొరికి వెళ్ళబోతూంటే “ఎందుకంత కంగారూ! అదెక్కడికీ పారిపోదు కాని, ముందో రెండు ముద్దలు తినండి” అంది. అబ్బే లోపలికి పోనిదే. ఆత్రంగా కంప్యూటర్ దగ్గరకొచ్చి ఆన్ చేయగానే తాతా! అని ఒంటిపూట బడికి వెళ్ళొచ్చిన మనవరాలు కంప్యూటర్ ఆక్రమించింది. మనవరాలుని కాదనగలనా? అది నా బలహీనత. ఎప్పుడు ఖాళీ…
అసలు టపాను చూడండి 181 more words