#fraud #online timesofindia.indiatimes.com/tech/tech-news…
—
gelli prasad (@gpvprasad) December 15, 2014
మోసం దగా కుట్ర ఈ వ్యాపార చరిత్ర ఎప్పటికీ మారదు!
ఈ మోసాలు కొత్త కాదు ఎప్పటి నుంచో ఉన్నవే, కాకపొతే అప్పుడప్పుడు కొత్త రూపం సంతరించు కుంటాయి!
ఇక్కడ ఈ రకమైన మోసం జరిగి ఉండవచ్చు, సరుకు పంపించిన వ్యక్తి ఆ సరుకు సరైన గమ్యస్థానం చేరుకుందో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా చేసి ఉండవచ్చు.
ఒకటి అసలైన iphone ఇంకొకటి చెక్కలు. దాంతో ఆ సదరు సరుకు పంపించిన వ్యక్తి ఎదో రకంగా తెలుసుకోగలడు అసలైన వ్యక్తికే సరుకు అందింది అని. లేదా ఆ అమ్మకం దారు దగ్గర రెండవది లేదు కాబట్టి ఇలా పంపించి, రెండవది పంపడానికి కొంచం సమయం సృష్టించు కున్నాడు.
లేదా ఇంకో రకం కొనే వ్యక్తీ అమ్మే వ్యక్తీ ఒకరికి ఒకరు తెలుసు, వాళ్ళు అసలు snapdeal ఏ రకంగా సరుకు రవాణా చేస్తుందో తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం చేసి ఉండవచ్చు!
ఇది కాకపొతే సరుకు రవాణా చేసే వాడే మార్చి ఉండవచ్చు!
ఇంకో మోసం, snapdeal లాంటివి పెరిగిపోవడం వలన చిన్న చిన్న వ్యాపారులు నష్ట పోతున్నారని వీటిని అభాసుపాలు చెయ్యడానికి ఈ విధంగా చెక్కలు పంపి ఉంచవచ్చు.
లేకపోతె వేరే online site ఈ అమ్మకందారులు కు డబ్బులు ఇచ్చి ఇలాంటి అభాసుపాలు చేసే ప్రయత్నం కూడా కావొచ్చు!
అసలు వాళ్ళు ఏ దారి తీసుకున్నా అది చిన్న వ్యాపారులకు నష్టం కలిగించేదే!