కానే కాదు, అది విషం!
ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో అభద్రతా భావానికి పరోక్ష యుద్దాలకు మూలం అవుతూ ఉంది!
నిమ్న వర్గాలను బాగు చెయ్యడానికి వాళ్లకు పని నిరంతరం దొరికేలా చేసే వాళ్ళు ఉన్నత స్థితికి చేరడానికి సహకారం చేదు గుళిక, కానీ వాళ్ళకు ఆయుధం ఇచ్చి మీరే బాగు చేసుకోండి అంటే అది విషం గుళిక, ఈ విషయం తమని తాము అభ్యుదయ వాదులుగా అభివర్ణించు కునే కుహానా వాదులు అర్ధం చేసుకుంటే బాగుంటుంది!
ఆయుధం ఇస్తే బాగు పడతాడో లేదో తెలియదు కానీ బలమున్నోడే బ్రతుకుతాడు బలం లేని వాడు చస్తాడు అనేది సత్యం!
బక్కచిక్కిన వాడికి ఆయుధం పట్టడం నేర్పిచడం వల్ల ఆయుధాల సంస్థలు లాభ పడుతున్నాయి తప్ప అవసరమైన వాడికి నీరు అందట్లేదు, తిండి చేరట్లేదు!
మధ్యవర్తిత్వం అంటే మీ లాభంలో కొంతభాగం నాకు ఇవ్వు అన్నట్లు ఉండకూడదు, ఇద్దరికీ సమానత్వం అర్ధం అయ్యేలా చేసి ఇద్దరూ సమానంగా బ్రతికేలా చెయ్యాలి, ఒకడు ఇంకొకడికి బానిస కాకూడదు!
కానీ సమానత్వమే తమ జీవిత పరమావధి అని చెప్పుకుంటున్నా కొందరు చైనా వాళ్ళు శక్తి లేని వాళ్లకు ఆయుధాలు అమ్ముతారు, ఎప్పుడు అంటే ఆ ప్రాంతంలో శక్తి ఉన్న వాడు వాళ్ళ దగ్గర నుంచీ సరుకులు కొననప్పుడు. దాని వల్ల కొనగల శక్తి ఉన్న వాడి దగ్గర నుంచీ డబ్బులు వస్తాయి కాబట్టి! ఇది నిజం.
అందుకే సహకారం చేదు గుళిక కాదు చెడు గుళిక!