కథ మళ్ళీ మొదటికే వచ్చింది, నేను చాలాసార్లు అడిగాను ప్రభుత్వాలని, పండగల సమయంలో తక్కువ దూరం వెళ్ళే ధూమ శకటం లు ఎక్కువగా ప్రవేశ పెట్టమని, వినలేదు మళ్ళీ మనం అదే పరుగులు . అన్నిటికన్నా అతి ముఖ్యం దూరం ఎక్కువ వెళ్ళే శకటం లో ticket లేని ప్రయాణీకులు లేదా reservation compartment లో reservation లేని ప్రయాణీకులు, మళ్ళీ మళ్ళీ మనం ఎక్కువ ధరకు private vehicles లో ప్రయాణాలు! నిజంగా ఇదో నరకం అయితే ఇంకో నరకం కొందరు ప్రయాణీకులు సొంత వాహనాలలో ప్రయాణం చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఇంకా విషమం వాళ్ళు కట్టే tolls ధరతో ఒక వారం రోజులు సామాన్య కుటుంబం విలాసవంతంగా మూడు పూటలా తినే అంత!
ఇక కోడి పందేల సంగతి సరే సరి, ఎలాగైనా అవి చనిపోతాయి కానీ యుద్ధంలో వీరమనరణం పొందినట్టు అక్కడ చంపేస్తారు, దీన్ని ప్రక్రుతి ప్రేమికులు జీవహింస అని అంటారు, డబ్బు ప్రేమికులు ఇది ఆచారం అంటారు, అప్పు ఇచ్చే వాళ్ళు ఇది ఉండాలి అంటారు!
సంక్రాంతికి మనం ఇంకా డబ్బులు పోగొట్టుకునే మార్గం పండుగ నజరానాలు!
మామూలు రోజులలో కన్నా ఈ రోజులలో కొంచం వస్తువులను తక్కువ ధరకు అమ్ముతారు, దానికి రెండు కారణాలు
౧. పాత వస్తువులు(రెండో చెయ్యి కాదు వాళ్ళ దగ్గర చాలా రోజుల నుంచీ ఉన్నవి)
౨. లాభం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ధర తగ్గిస్తారు!
ఇది కొంత తక్కువ నష్టం చేస్తుంది, కానీ నజరానాలు అని చెప్పే మోసం ఇది చాల ఏక్కువ నష్టం తెస్తుంది ఎందుకంటే ఆ నజరానా దక్కాలి అని చెప్పి అవసరం లేకుండా చాలా కొంటాం! నిజానికి ఆ నజరానా ఎవరికీ ఇస్తారో ముందే నిశ్చయం చేస్తారు మనల్ని పప్పుసుద్దల్ని చేస్తారు!
కానీ భోగి నాడు పాత వస్తువులు పడెయ్యడం లేదా దహించడం చెయ్యడం మానకండి!