అసహజ వాతావరణం లో బ్రతికితే శక్తి అనవసరంగా పోతుంది!
ఉన్నత స్థితి అనే అసహజ స్థితిలో ఉంటె, రక్షణ కోసం శక్తి పోతుంది!
మూర్ఖత్వం అనే అసహజ స్థితిలో ఉంటె, నాలా blog లు వ్రాస్తూ సమయం వృధా అవుతుంది!
ఇది వ్రాసింది ఎందుకంటే, వామ పక్షాలు అమెరికా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తీ భారతావనిలో అడుగు పెట్టకూడదు అన్నందుకు!
ఇక్కడ నాకు అర్ధం కాని ప్రశ్నలు చాలా ఉన్నాయి
౧. భారతావనిలో ఇద్దరి మధ్య తగువు పెట్టి పిల్లి పిల్లి తగువు తీర్చిన కోతి అడుగు పెట్టకూడదు అంటున్నారు, మరి ఈ వామ పక్ష సంస్థలు చేస్తున్నది ఏమిటి? అదే కదా తమకు లాభం వచ్చే పని చేసే చేస్తున్నారు, అది ఏదైనా కావొచ్చు తమకు నచ్చని వాడిని చంపడం తమకు ఇష్టమైన పని చెయ్యడం, అంటే వాళ్ళు భారతా వనిలో ఉండకూడదు కదా మరి ఎందుకు ఉన్నారు.
౨. వాళ్ళ అభిప్రాయం ప్రకారం యుద్ధం చేయిస్తున్నారు అని, అంటే ఇద్దరికీ ఆయుధాలు ఇవ్వాలి, నాకు తెలిసి ఒకరికి ఇస్తున్నారు, ఇంకొకరికి కూడా ఇస్తున్నారు అని మీకు తెలుసా? తెలిస్తే ఎందుకు చెప్పట్లేదు?
౩. అక్కడ జరుగుతున్న యుద్ధం బ్రతకనివ్వట్లేదు కాదు, ఆధిపత్యం కోసం అని వాళ్లకు తెలియదా?
౪. ఆంద్ర తెలంగాణా అనే ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ ప్రశ్న తలెత్తలేదా “వీళ్ళు భారతా వానిలో ఉండకూడదు అనుకునే వాళ్ళు ఉండరా అని?”
నా ప్రశ్నలకు కారణం, నేను అమరికాను సమర్ధిస్తున్నాను అని కాదు, నాకు తెలిసిన ఈ చిన్న విషయాలు కూడా తమని తాము తెలివైన వాళ్ళుగా చెప్పుకుంటున్న వాళ్లకు తెలియదా?
అందరం స్వలాభం కోసం ప్రయత్నిస్తుంటాం!