కొంతమందికి చిర్రున కోపం వస్తుంది, హోలీ అర్ధం ఏమిటి అని అడిగితె.
పోనీ వాళ్ళ కోసం ప్రశ్న మారిస్తే “హోలీ ఎందుకు చేసుకుంటారు”
నూటికి ౯౦ శాతం మందికి తెలియదు అనే అనుకుంటున్నాను!
నిజానికి హోలీ గురిచి తెలుసుకోవాలి అంటే హోలిక గురించి తెలుసుకోవాలి!
హోలికా హిరణ్యకశిపు యొక్క చెల్లెలు, అంటే ప్రహ్లాదుడి మేనత్త!
హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని సంహరించడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడం పరిపాటిగా మారడంతో, హోలిక ప్రహ్లాదుడిని సంహరించడానికి ఒక ఉపాయం చెబుతుంది, దాని ప్రకారం సంహరిద్దాం అంటుంది.
ఆ ఉపాయం ఏమిటంటే హోలిక దగ్గర ఒక వస్త్రం ఉంటుంది అది అగ్నికి ఆహుతి కాదు, అది హోలిక ధరించి ప్రహ్లాదుడిని తనతో తీసుకు వెళ్లి అగ్నిగుండం మీద కూర్చుంటాను అంటుంది. సరే అని హిరణ్యకశిపుడు ఒప్పుకుంటాడు. అలాగే చెయ్యడానికి ప్రయత్నిస్తారు.
కానీ విష్ణు మాయ, నిప్పు పెట్టగానే అక్కడ విపరీతమైన గాలి వల్ల దుమ్ము హోలిక కంట్లో పడుతుంది, ఆ సమయంలో హోలిక దగ్గర ఉన్న వస్త్రం ప్రహ్లాదుని మీద పది ప్రహ్లాదుడు జీవిస్తాడు, కానీ హోలిక దహనం అయిపోతుంది.
ఈ కారణం చేత హోలీ చేసుకుంటారు!
కానీ అసలు హోలీ ఎలా చేసుకుంటారు అంటే, ఆ రోజు ఒక బొమ్మకు నిప్పు పెట్టి దాని మీద దుమ్ము జల్లుతారు అని మాత్రం ఒకరి ద్వారా తెలిసింది, కానీ ఈ రంగుల కోడిగుడ్ల టమోటాల పిచ్చి ఎలా మొదలయ్యిందో నాకు తెలియదు!