మామూలుగా నవమి రోజున రాముల వారికి సీతమ్మ వారికి కళ్యాణం జరుగుతుంది.ఒంటిమిట్ట ఆలయం లో ఇది ప్రత్యేకత, ఇక్కడ మాత్రం చతుర్దశి నాడు జరుగుతుంది!
అసలు ఒంటిమిట్ట ప్రభుత్వం ఎందుకు ఎంచుకుంది?
౧. చాలా మంది ప్రజా ప్రతినిధులు భద్రాది రాముని కళ్యాణం కు వెళతారు, కాబట్టి ఒంటిమిట్ట అయితే వాళ్ళు కళ్యాణంలో పాల్గొని ఆంద్ర ప్రభుత్వ ఉనికిని కాపాడ వచ్చు, లేక పొతే తరువాత రోజు పత్రికలలో లేదా ఆ రోజు వార్తలలో ప్రధాన వార్త ఆంధ్రా ప్రాంత నాయకులు భద్రాద్రి కళ్యాణం లో పాల్గొన్నారు, ఆంద్ర ప్రాంతంలో పాల్గొనలేదు! ఎంత అప్రతిష్ట!
౨. ప్రజలు కూడా భద్రాద్రి రాముల వారినే ఎన్నుకుంటారు, ఇక వేరే రోజు వస్తుంది కాబట్టి ఒంటిమిట్ట లో కూడా వచ్చి ప్రభుత్వానికి డబ్బు లాభం చేకూరుస్తారు!
మరి స్వామీజీల మాట, ప్రభుత్వం అన్ని చోట్ల జరిగే సమయంలో కాకుండా ఒక ప్రాంతం ఆచారం అందరి మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ ఆంద్ర ప్రజలను అపహాస్యం పాలు చేస్తుంది అని.
రేపు ఎవరైనా రాముల వారి కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది అంటే ఆంధ్ర ప్రజలకు సందేహం వస్తుంది కూడా!
ఎవరి వాదనలు వాళ్ళవి! చివరికి రాముల వారి ఉన్నతిని ఆంద్ర తెలంగాణా చిచ్చు మళ్ళీ క్రిందకు తోస్తుంది!
భక్తిలో కూడ పోటీ అవసరమా?
ఒకరు యాదగిరిని తిరుమలలా చెయ్యాలనుకుంటారు.
ఇంకొకరు ఒంటిమిట్టను భద్రాద్రిలా చెయ్యాలనుకుంటున్నారు.