ఒక పక్క ధరల పెరుగుదల, ఇంకో పక్క ఈ తొండట రాష్ట్ర పన్నులు!
ప్రజలు సుఖ పడరు, నాయకులు మాత్రమె!
ధన వంతుడు మిగిలిన వారికి సాయం చెయ్యట్లేదు అని పన్ను విధించారు, కానీ ఇప్పుడు పేదవాడు ధనవంతుడికి సాయం చెయ్యట్లేదు అని పన్ను విధిస్తున్నారు! అప్పుడు ఇప్పుడు మధ్యతరగతి వాడు పన్ను పీక్కుంటున్నాడు! ఎందుకంటే ధనవంతుడు కి తెలుసు డబ్బులు ఎలా సంపాదించాలో, పేదవాడికి తెలుసు ఎలా ప్రభుత్వ సహకారాలు పొందాలో, కానీ మధ్యతరగతి వాడికి రెండూ లేవు!
ధనవంతుడు మధ్య తరగతి వాడితో ఆడుకుంటాడు, పేదవాడు మధ్య తరగతి వాడిని తిడతాడు, ఎందుకంటే ఇద్దరూ ఒకరిని ఒకరు కలవారు. ఈ మధ్యలో ప్రభుత్వం మధ్యతరగతి వాడి మీద పన్ను భారం మోపి పన్ను పీకుతూనే ఉంటుంది!
డబ్బులు లేకపోతె ఎంత హాయిగా ఉండేదో!
వీధిలో చెత్తను తగలు పెట్టి ఆహారం వండుకునే వారు, కానీ డబ్బులు వచ్చాకా వీదిలో చెత్త తగులు పెడుతున్నారు తప్ప దాని నుంచీ విడుదలైన ఉష్ణం ఎందూకూ ఉపయోగించట్లేదు!
ఇది ఒక ఉదాహరణ మాత్రమె!
ఇలాంటివి చాలా ఉన్నాయి! ఏమిటో ఈ పన్ను పీకుడు కార్యక్రమం, ఇప్పటికే IRCTC ౪ నెలల ముందుకు జరిపింది reservation, ఇక పండుగల సమయానికి tickets ఉండవు, దాంతో bus లు వీటి మీద పన్ను పీకుడు! హహ్హహ్హ ఇక మధ్య తరగతి జీవి ప్రయాణం అన్న విషయం మరచిపో!