ఓ దేశ ప్రజలారా ప్రకృతి ని హరిస్తున్న వారికి వంతు పాడవద్దు!
ఈ టపాలో నేను ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వారికి సహకరిస్తున్న వారి కోసం వ్రాస్తున్నాను!
మీకు జీవనాధారం కావాలి, కానీ ప్రభుత్వాలు పని చూపించట్లేదు అని చెప్పి ఎర్ర చందనం నరికివేతకు వెళుతున్నారు, కానీ మీరు చాలా విషయాలు మరచి పోతున్నారు.
మనకు భూమి మీద బ్రతకడానికి గాలి నీరు, ఆహారం కావాలి.
మరి గాలి అంటే ప్రాణ వాయువు అని అర్ధం, కానీ గాలి అని కాదు. మరి అలంటి గాలిని ఇచ్చే చెట్లను ఎలా నరుకుతున్నారు. మాకు జీవనోపాధి అదే ఇస్తుంది అంటారా, ఏమీ చెయ్యలేను కానీ సలహా మాత్రం ఇవ్వగలను. మేము (అనగా యంత్రాల మీద , యంత్రాల వలన యంత్రాల కోసం పనిచేసే వాళ్ళు) ఇప్పటికే చాల ప్రకృతి నాశనం చేసాము, మీరు దాన్ని సరి చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రభుత్వాలను అడగండి, మాకు సమాజాన్ని బాగు చేసే అవకాశం ఇవ్వమని, లేకపోతె వెళ్ళి పంటలు పందించండి.
నీళ్ళు లేకుండా పంటలు ఎలా పండిస్తాం అంటారా, నీళ్ళు లేక కాదు మేము నీళ్ళు రాకుండా చేసాం. మీరు శక్తి వంతులు మీరు నీళ్ళు వచ్చేలా చెయ్యండి! ఉదాహరణకు చెరువులు తవ్వడం మొక్కలు పెంచడం. తరువాత ప్రకృతే మనకు జీవనం చూపిస్తుంది!
ఆంద్ర రాష్ట్రంలో ఉన్న వారిని కాకుండా మిమ్మల్నే ఎందుకు ఎంచుకుంటున్నా రో కూడా తెలుసుకోండి, మీకు వేరే పని రాకుండా చెయ్యడానికే, దాంతో తరువాత మిమ్మల్ని బానిసలుగా చేస్తారు అని కూడా గుర్తుంచుకోండి.