దయచేసి చదవ వద్దు

ఇంకా చదవాలి అనుకుంటున్నారా అయితే మీ ఇష్టం

ఇంత క్రిందకు పెట్టినా కూడా చదవాలి ఆనుకుంటున్నారా మీ ఇష్టం.
ఒక ఉధ్యొగ ప్రయత్నం చేస్తున్న అభ్యర్ధికి అతని అభ్యర్ధిత్వం ని పశ్నిస్తున్న మోఖిక పరీక్షకుడి మధ్య సంవాదం

మౌఖిక పరీక్షకుడు : ఉధ్యోగం ఎందుకు మారాలి అనుకుంటున్నవు

అభ్యర్ధి:(మౌఖిక పరీక్ష తరువాత నీకే తెలుస్తుంది) నా అభివృధ్ధి కి దోహద పడే సంస్థలో పనిచేద్దం అని!

మౌఖిక పరీక్షకుడు: ప్రస్తుతం సంస్థ నీకు అలాంటి అవకాశాలు ఇవ్వట్లేదా?

అభ్యర్ధి:!!!!!!!!!!!!!!!!!

మౌఖిక పరీక్షకుడు: I2C గురించి చెప్పు!

అభ్యర్ధి: చాలా కాలం క్రితం పని చేసాను నాకు సరిగ్గా గుర్తుకు లేదు, కానీ రెండు లేదా అంతకన్నా ఎక్కువ chips తో మాట్లాడించడానికి వాడతాము.

ఆ chips రెండు lines తో అనుసంధానం చేస్తాము, ఒకటి serial clock ఇంకొకటి serial Data line. ఇక వాటిలో ఒకటి కన్నా ఎక్కువ master chips  ఉండవచ్చు, కొన్ని slave chips ఉండవచ్చు, అవి మాట్లాడుకోవడానికి వాటికి నిర్ధిష్ట సంఖ్యను అనుసంధానం చేస్తాము. ఆ సంఖ్య ఆధారంగా అవి సంభాషించుకుంటాయి. ఒకటి Master గా ఉన్నప్పుడు ఇంకో master slave గా ఉండాలి.

ఇక master slave ఈ క్రింది విధాలలో ఎదో ఒక విధానంలో సంభాషించుకుంటాయి

master transmit — master node is sending data to a slave

master receive — master node is receiving data from a slave

slave transmit — slave node is sending data to the master

slave receive — slave node is receiving data from the master

master సమచారం పంపే ముందు లేదా తీసుకోవడానికి సిద్దం అని చెప్పడానికి sda ను తక్కువ చేసి తరువాత scl ను తక్కువ చేస్తుంది, దీనిని start indication అంటారు. ఇది జరిగిన తరువాత master ఎవరితో సంభాషణ చెయ్యాలి అనుకుంటున్నారో ఆ chip address ను byte యొక్క మొదటి ౭ bits లో పంపి తరువాత ఆఖరి bit లో ఏ సంభాషణ అన్న విధానం SDA line  లో పంపుతాది. ఇక ఆ lines కు connect అయిన devices ఆ address తీసుకుని వాటికి చెందినది అయితే సమాధానం ఇస్తాయి, ఒక ACK పంపించి.

master చదవాలి అనుకుంటే, master ముందుగా sda line ను చదవడానికి మాత్రమే అన్నట్లు తన setting పెట్టుకుంటాడు, slave master అడిగిన byte ను SDA line మీద పంపుతుంది. ఆ byte చదవడం పూర్తవగానే master ACK పంపుతుంది, లేదా stop indication పంపుతుంది, ACK సందేశం కాకుండా stop indication వస్తే slave వ్రాయడం మానేస్తాది, ఒకవేళ ACK వస్తే తరువాత byte ను పంపుతుంది.

master clock ఎక్కువలో ఉన్నప్పుడు SDA మీద వ్రాస్తాడు. ఈ సారి ACK పంపడం slave పని. కానీ stop మాత్రం master మాత్రమే పంపుతుంది.

మౌఖిక పరీక్షకుడు: నిన్న రాత్రి చదివి వచ్చవు కదా?

అభ్యర్ధి: గుర్తున్నాది చెప్పను.

మౌఖిక పరీక్షకుడు: నేను నీలాంటి వాళ్ళను కాదు నిజంగా పని చేసిన వాళ్ళ కోసం చూస్తున్నాం!

అభ్యర్ధి:(ముందే అనుకున్నాను నేను ఎందుకు మారాలి అనుకుంటున్నానో నీకు ఇప్పుడు అర్ధం అవుతుంది అని, కానీ ఏమి చెయ్యగలను నీ సంస్థకు నేను పనికి రాను అంటున్నావు, అదే సమాధానం నాకు అన్ని చోట్లా వస్తుంది) .

ఈ అభ్యర్ధికి దిశ నిర్దేశించండి!

దయచేసి చదవ వద్దు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.