గతం :
పెట్టుబడి దారుల నడ్డి విరగాకోట్టడానికి చిత్రాలు లేదా నాటికలలో పనిచేసే వారు!
ప్రస్తుతం:
వాళ్ళలో కొంతమంది పెట్టుబడి దారులుగా రూపాంతరం చెందారు!
గతం:
రాజులు అప్పుడప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకునే వారు
ప్రస్తుతం:
రాజులు ప్రజల మధ్యలోకి వెళ్ళాలి అంటే కుదరదు ఎందుకంటే ఎవడు రాజో అందరికీ తెలుసు.
గతం;
ప్రజలు రాజు దగ్గరకు వెళ్లి తమ కష్టాలు చెప్పుకునే వారు
ప్రస్తుతం:
రాజు తన చుట్టూ పక్కల వున్న వారి కష్టాలే ప్రజల కష్టాలు అనుకుంటున్నారు
గతం:
డబ్బు కేవలం ఆకలి తీర్చడానికి ఉపయోగించే వారు, కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడానికి!
ప్రస్తుతం:
ధనం ఉన్న వాళ్ళు లేని వాళ్ళను, ధనవంతుల వ్యతిరేకుల మీద దాడి చేయడానికి ప్రజలను సమకూర్చడానికి ఆ ధనం ఉపయోగిస్తున్నారు!