నాకు నెప్పి పెట్టిన ప్రతీసారి అమ్మ బాధ పడేది, కానీ అమ్మ బాధను తీర్చే శక్తి నాకు లేదు.
కానీ అమ్మకు కేవలం ఆనందం మిగల్చ గలిగే ప్రయత్నం మాత్రం చేస్తున్నాను.
నా ప్రతీ చిన్న బాధకు అమ్మె మందు, అమ్మ ఇచ్చెది మొదట ప్రేమ మందు తరువాత పోపుల పెట్టి తో ఇంటి వైధ్యం. అమ్మకు చిన్న చిన్న సరదాలు చలా ఇష్తం. అమ్మకు ఆడపిల్ల అన్నా చిన్న పిల్లలు అన్నా చాలా ఇష్టం. అమ్మకు ప్రాణం నేను అన్నయ్య. అమ్మ చేసే ప్రతీదీ మా కోసమే చేస్తుంది.
అమ్మ మా ప్రతీ ప్రయాణం కోసం అన్నీ సమకూరుస్తుంది, అమ్మకు ఏకాలంలో ఏమి తినాలో బాగా తెలుసు. చిన్నప్పుడు వేసవిలో బార్లీ నీరు ఇచ్చేది. అలాగే ప్రతీ కాలంలో ఆ కాలనికి అణుగుణంగా ఆహారం ఇచ్చేది.
అమ్మ చిట్కాలు కొన్ని
౧. నీటి విరోచనాలు అవుతుంటే మజ్జిగలో ఉప్పు కలుపుకుని తాగండి
౨. మామూలు విరోచనాలు అవుతుంటె మజ్జిగలో కొంచం మెంతులు కలిపి తాగండి.
౩. నీటి విరోచనాలు తగ్గడానికి ఇంకో సలహా, వాములో ఉప్పు కలుపుకుని చప్పరించి మింగాలి.
ఇలాంటి చిట్కాలు ఇంకా ఉన్నాయి గుర్తు వచ్చినప్పుడు చెబుతాను.