సాధారణంగా అందరూ ooty వెళ్ళడానికి సరైన సమయం వేసవి కాలం లేదా శీతాకాలం అంటారు, నేను అటు వేసవి కాదు ఇటు శీతాకాలం కాని కాలంలో వెళ్ళి కొన్ని సగం చూసాను కొన్ని పూర్తిగా చూసాను!
ఇక మాప్రయాణ వివరాలు
౧౪ ఉదయం బయలుదేరాము, ముందుగానే room కు కావలిసిన ఏర్పాట్లు చేసుకున్నాం, కాబట్టి అక్కడకు వెళ్ళగానే room వెతుకులాట కోసం సమయం వెచ్చించాల్సిన పని లేదు, తరువాత అక్కడ నుంచీ Botanical garden కు వెళ్ళాం, అసలు అక్కడ చెట్లు చేమలు, ఒకటేమిటి బోలెడు, వాట్లో కొన్ని
తరువాత సమయం ముగియడంతో బయటకు వచ్చి నీలగిరి తైలం కొన్నాం, ధరలు
౧౦౦ ml –
120/- govt దుకాణంలో
135/- prinvate అంగడిలో
వ్యత్యాసం ఎందుకంటే concentation levels
ఇక అవి రెండు తీసుకుని, winter green oil తీసుకుని బయలుదేరాము!
రాత్రి నిద్ర సమయం కాని సమయం కాబట్టి ఉష్ణోగ్రత తక్కువగా లేదు కానీ కొంచం చలిగా ఉంది!
రెండవ రోజు
ఉదయాన్నే cab మాట్లాడుకున్నాం మొదట shooting spot
అక్కడమేము flag hoisting చూసాం!
అక్కడ గుర్రపుస్వారీ ధరలు
చిత్రానికి ౨౦
గుర్రపు స్వారీ ౧౦౦
అర్ధ ప్రదక్షణం ౩౦౦
పూర్తి ప్రదక్షణం ౬౦౦
మాకు అంత ధైర్యం లేక చిత్రాలతో సరిపెట్టుకున్నాం!
తరువాత pykara water falls అక్కడ కు వెళ్ళగానే ముందు ఒక board నీళ్ళు లేవు నిరాశ పడోచ్చు అని, సర్లే అని వెళ్ళం! ౨౦౦ మెట్లు దిగాకా ఇదీ పరిస్థితి!
ఇక ఏమిచెయ్యాలో అర్ధం కాక, అభయారణ్యం వైపు వెళ్దాం అన్నడు చోధకుడు, అక్కడ వాళ్ళ board మీద వ్రాసుంది, మీకు జంతువులు కనపడితే మీ అదృష్టం(వాటికి మీరు ఆహారం అయితే వాటి దురదృష్టం అంటాడేమో అనుకున్నా, అనలేదు), సర్లే కనిపిస్తే కనిపిస్తాయి అనుకుని బయలుదేరాం ముదుమలై Tiger reserve forest, ౩౫ kilo meters ఒక్క అడవిదున్న తప్పించి ఇంక ఏమీ కనిపించలేదు 😦
తరువాత నిరాశ ఇంకో పెద్ద నిరాశ, Rose garden, వెతికితే కొన్ని పూలు కనిపించాయి!
ఇంత నిరాశ తరువాత ఒక్కటే ఆశాజ్యోతి అది boating, ధర
ఇద్దరికి ౧౨౦
నలుగురికి ౨౦౦
అదే rowing అయితే వేరే ధర, ఇక గుంపుగా వెళ్ళే వాళ్ళకు వేరే ధర!
మేము boating తీసుకున్నం ౩౦ నిమిషాలు
తరువాత Thread Garden, sorry మా phone లో battery అయిపోయింది కాబట్టి నో చిత్రం!
తిరుగుప్రయాణ సమయంలో ఉదకమండలం కొండలను మేఘాలు ఆవరించాయి!
చివరగా నేను చెప్పలి అనుకున్నది ఏమిటంటే
మీరు, rose garden, waterfalls etc చూడాలి అనుకుంటే summer or winter. కానీ మాకు లాగా enjoy చెయ్యాలి అంటే ఇదే సరైన సమయం!