అనగనగా ఒక congress తరపు ఎన్నికలకు వెళ్ళి ఓడిపోయిన ఒక అభ్యర్ధి ధూమశకటాల నిలయానికి వెళ్ళీ బీహార్ లో ప్రజలకు కర పత్రాలు పంచాడు, వాటిలో సందేశం ఏమిటి అనగా బిహార్ ఎన్నికలలో భాజపాకు మీ మద్దతు ప్రకటించకండి అని ప్రచారం చేశాడు. అతన్ని బంధిచారు రక్షక భటులు.
అసలు ఆ ప్రచారం ఎందుకు చేసాడు అని ఆలోచిస్తే నాకు అర్ధం అయిన విషయాలు
౧. భాజపా వస్తే అక్కడ పుట్టిన వారు తిరిగి స్వరాష్ట్రానికి వెళ్ళిపోతారు అని భయపడ్డడు, ఎందుకంటే అక్కడ ఉధ్యోగం వస్తుంది స్వగ్రామం అని.
౨. వీళ్ళు వెళ్ళిపోతే కుక్క చాకిరీ చేసే వాళ్ళు తగ్గిపోతారు అని భయం కూడా కావొచ్చు.
నాకు భారత ఎన్నికల సంఘంలో ఉన్న ఒక తిరకాసు అర్ధం కాదు, వాళ్ళు ఊరిలో ఉండకపోతే వాళ్ళకు ఆ ఊరిలో ఓటు హక్కు ఎలా ఉంటుంది?