ఎప్పుడు సహనం కావాలి, ప్రేమ పెళ్ళిళ్ళు ఒప్పుకునేటప్పుడు, ఎందుకంటే అది మానవజాతి నిర్మూలనకి దారి తీస్తుంది కాబట్టి!
ప్రత్రికలలో ప్రకటనలు చూడటానికి, ఎందుకంటే సమాజం సాధక బాధకాలు అది చెప్పదు కాబట్టి!
మా లో బాహుబలి చూస్తున్నప్పుడు, ఎందుకంటే చిత్రం కన్నా ప్రకటనలు ఎక్కువ కాబట్టి!
సమానత్వం కోసం పోరాటం చేసేటప్పుడు, ఎందుకంటే అది ధనవంతుడిని ధనవంతుడిగా ఉంచుతుంది కాబట్టి!
పేదవాడికోసం మాట్లాడేటప్పుడు, ఎందుకంటే అది రాజకీయ నాయకుడిని బ్రతికిస్తుంది కాబట్టి!
ఇవా మన problems?
కానే కాదు, మన దేశం ప్రస్థుతం ఉన్న దుస్థితికి కారణాలు
రైతులు ఆకలితో అలమటించడం, ప్రజలు దాహం తీర్చుకోలేకపోవడం, చెత్త పెరిగిపోవడం.
కారణాలు చూస్తే కొన్ని శ్రీమంతుడు లో ఉన్నాయి, అవి ఊరిలో చెరువులలో చెత్త కూరికిపోవడం లేదా, నీళ్ళు మత్తు పానీయాలు తయారీకి ఉపయోగించడం!
ఇవికాకుండా మనం మన కోసం ఎవడో వస్తాడు అని ఎదురుచూడడం!
ఇక పట్టణాలలో భూమిలోకి నీరు చేరకుండా ఇళ్ళు కట్టడం!
ఇక చెత్త పెరిగిపోవడానికి కారణం అతిగా మనం వాడుతున్న plastic మరియు అతిగా ఉపయోగిస్తున్న online purchases!
online purchases ఎందుకు అన్నాను అంటే తయారీ దారుడు దాన్ని అందంగా ఒక డబ్బాలో పెడతాడు, వీళ్ళు దాన్ని మళ్ళీ ఇంకోడబ్బలో పెడతారు! మరి దుకాణాలలో కూడా ఉంటాయి, ఎలాగ సమాయించుకోవాలి అంటే చిన్న బెత్తం తో దెబ్బ గట్టిగా తగలదు, కానీ సన్న పెద్ద బెత్తంతో దెబ్బ గట్టిగా తగులుతుంది అని!
అంతెందుకు నా దెగ్గరే ౫ చరవాణీలు అందులో మూడు పనిచెయ్యనివి ఉన్నాయి, ఎలా పాడెయ్యలో అర్ధం కాక ఇంట్లో పేర్చుకున్నను!
ఇవి NEWS వాళ్ళకు అసలు సమస్య కాదు, ఎందుకంటే అందరూ కలిసి చేసే తప్పు కాబట్టి ఒప్పు! ౧౦౦ కోట్ల మంది చేసే తప్పు తప్పు కాదు, ౨౦ కోట్ల మంది చేసేది తప్పు.
అయినా నా బుద్ది తక్కువ గానీ NEWS అంటే అర్ధం Now Earn With Social problems కదా!