నిజానికి ప్రతీ ఒక్కడు సందట్లో సడేమియా అన్నట్టు ఎదో ఒక అక్కసు వెళ్ళగొట్టుకుంటున్నారు, మరి నేను తక్కువ కాదు అని నేను కూడా ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నాను!
అసలు ఏమి జరుగుతుంది కొందరు ఎలా దాన్ని అబద్దం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు చూద్దాం!
ఢిల్లీలో కాలుష్యం కారణం పంజాబ్ లో పంటను తగుల పెట్టడం!
దీన్ని NDTV తన మారణాయుధంగా వాడుకుంది! ఎలాగా అంటే పంజాబ్ లో వ్యవసాయం చేసే వాళ్ళది తప్పు అని, మరి NDTV solution పంజాబ్ వాసులు పంటలు తగలబెట్టకూడదు, మరి ఏమిచెయ్యాలో NDTV చెప్పలేదు, ఎందుకంటే NDTV కు సమాధానం తెలియదు, ఏదో ఒకలాగా అభద్రతా భావం పెంచితే నాలుగుడబ్బులు వెనక వేసుకోవచ్చు అనే అభిప్రాయం, ఇది ఎప్పటినుంచో ఉంది, అది అందరికీ తెలిసినదే! ఇద్దరి మధ్య గొడవ పెడితే మూడోవాడు బ్రతుకుతాడు కదా.
నేను సమాధానం చెబితే హిందుత్వం పులుముతారు కానీ చెబుతాను
ముసలి గోవులను ఒక చోటకి చేర్చి ఆ తగుల పెట్టల్సిన పంటను వాటికి ఆహారంగా పెట్టండి, వాటి పేడను ఎరువుగా వాడండి!
ఇక మొన్న కడపలో ౨౦ అడుగుల లోతు భారీ వర్షాలకు ఎర్పడ్డాది, కారణం అందరికీ తెలిసినదే మనం Motor బావులకు ప్రాధాన్యం ఇస్తున్నాం అదే చెరువులు తవ్వి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు!
ఇక ప్రజలలో నశిస్తున్న సహనశీల గుణానికి గల కారణాలు
౧. snapdeal/flipkart లో ఖరీదు చేస్తున్న వస్తువులు పదులు రాళ్ళు రప్పలు వస్తున్నందున
౨. తక్కువ శరీర భాగాలను దాచేదుస్తుల ఖరీదు, చీరల ధరకన్నా ఎక్కువ ఉండటం వలన.
౩. ఒకప్పుడు బొగ్గుతో పళ్ళు తోముకోవద్దు అన్న సంస్థ ఇప్పుడు మేము బొగ్గుతో పళ్ళు శుభ్రపరిచే వస్తువులు తయారు చెయ్యడం వలన.
౪. నల్ల ధనం మీద ప్రభుత్వం పోరాటం మొదలు పెట్టడం వలన.
౫. arvind kejriwal లాలూ ప్రసాద్ ను ఆలింగనం చేసుకుని అతని తప్పులని ప్రక్షాళన చెయ్యడం వలన.
౬. సహజ సిద్దంగా పండ్లను మగ్గనివ్వకపోవడం వలన.
ఇక బడా సంస్థల brand ambassadors ద్రుష్టిలో ఈ క్రింద కారణాలు
౧. ఒకప్పుడు ఇది నీకు మంచి చేస్తుంది అంటే నమ్మే ప్రజలు నిరూపన అడుగుతున్నారు అందుకు కావొచ్చు.
౨. ఒకప్పుడు నేను ఇది ఒప్పు అంటే గుడ్డిగా నమ్మే వాళ్ళు ఇప్పుడు అది తప్పు అని నన్ను ప్రశ్నించడం వలన.
౩. తప్పుడు మార్గంలో నడుస్తున్న coporate సంస్థలను Sensex నుంచీ తొలగించడం వలన.
ఇక వీళ్ళు కాకుండా ఇంకొంతమంది అసహనశీలులు
తన మతం అమ్మయి వేరే మతం అమ్మయిని పెళ్ళిచేసుకుంటుంది కాబట్టి కూడా కావొచ్చు.
ఇక మరి వీటికి అంతే లేదా అంటే నాకు తెలియదు, కులం అన్నాది పోవాలి కానీ పోదు కేవలం రూపంతరం చెందుతుంది, ఎందుకు అంటే ఒకప్పుడు వైశ్యుడు వైశ్యుల కుటుంబంలో అమ్మయినే పెళ్ళి చేసుకునే వాడు, క్షత్రియుడు క్షత్రియ కుటుంబంలో అమ్మయినే పెళ్ళి చేసుకునే వాడు, కొన్ని కొన్ని సార్లు అది జరిగేది కాదు. ఇప్పుడు ఒక software engineer ఒక software engineer ను, ఒక ప్రభుత్వ ఉధ్యోగి ఇంకొక ప్రభుత్వ ఉధ్యోగిని పెళ్ళి చేసుకోవడానికి ఇష్ట పడుతున్నారు. ప్రస్తుతం కులం యొక్క కొత్త రూపం ఉధ్యోగం!
నేను మతానికి కేవలం పెళ్ళి వరకు బంధుత్వం వరకు మద్దతు ఇస్తాను, కానీ తప్పుకు ఉధ్యోగానికి మాత్రం మద్దతు ఇవ్వను.
ఎందుకంటే మతంలో అన్ని కట్టుబాట్లు మానవ జాతిని నిలబెడతాయి.