వేరే కూరగాయలు వాటి కోసం ఇంకో కూరగాయ ఏడవటం చూసి ఆఖరి ఉల్లిపాయ శివుడిని నా కోసం ఏడ్చే వారు ఎవరు లేరు అని అడిగింది, దాంతో శివుడు సరే నిన్ను తరిగే వాడిచేత కన్నీరు తెప్పిస్తాను అని వరం ఇచ్చాడు, అందుకే ఉల్లిపాయను తరిగితే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తాయి!కానీ కొందరు నాకు ఉల్లిపాయ తరగడం వచ్చు కాబట్టి నాకు నీళ్ళు రావు అని అంటుంటారు!
నాకు ఒక విషయం అర్ధం అయ్యింది ఒకటే, వాడు తరిగింది చివరి ఉల్లిపాయ కాదు అని.
నేను ఇక్కడ చెబ్తుంది ఒకటే మన పూర్వికులు రాసిన చిన్న చిన్న ఇలాంటి కథలు శాస్త్ర పరంగా నిజం అనిపిస్తుంటాయి.
ఇంతకీ నేను చెబుదాం అనుకున్తున్నాది మనం కోసే ఉల్లిపాయ చివరి రోజులలో ఉంటే ఖచ్చితంగా కంట నీరు వస్తుంది. ఇప్పుడు ఆ కథ ను తిరిగి వ్రాస్తే ఇలా వస్తుంది, ఉల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచి కొస్తే కచ్చితంగా కళ్ళ వెంబడి నీళ్ళు తెప్పిస్తాయి. అందుకే ఉల్లిపాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచ కూడదు!