అమరశిల్పి జక్కన్న కథ ను తీసుకుంటే అప్పుడు NDTV మరియు times now ఇలా కథ అల్లేవి!జక్కన్న ఒక అమ్మాయిని ప్రేమించాడు
NDTV – జక్కన్న ఒక అమ్మాయిని నరకంలో పడకుండా కాపాడాడు!
Times now: Arnab Goswami చర్చ మొదలు పెట్టి ప్రజలకు మంచి చెప్తాడు.
ఇది చూసి మనం కూడా వాళ్ళ అభిప్రాయాలు కు మద్దతు పలుకుతాం!
ఇక తర్వాత రాజు మోసం చేసి జక్కన్న చేత శిల్పాలు చేక్కిస్తాడు!
ఇక ఇప్పుడు తమాషా మొదలవుతుంది, రాజ్యంలో ధనం రాజు ఏమి చేస్తున్నాడో వ్యవసాయ కూలీలు ఎలా ఉన్నారో తెలుసుకోకుండా
NDTV మరియు TIMES NOW ఆ వ్యవహారం చూపిస్తారు.
తర్వాత జక్కన్న కొడుకు కధ ఇక్కడ అసలు తమాషా మొదలవుతుంది
చిత్రాల ప్రకారం జక్కన్న చెక్కిన ఒక శిల్పం లో కప్ప ఉంది అని కొడుకు నిరూపించే సరికి, జక్కన్న తన ప్రతిజ్ఞ ప్రకారం చెయ్యి నరికేసుకుంటాడు!
ఇప్పుడు
NDTV తమాషా, రాజే జక్కన్న చెక్కిన శిల్పంలో కప్పను దాచి, వేగుల ద్వారా జక్కన్న కొడుకు దగ్గరకు సమాచారం వెళ్ళేల చూసారు అంటాది
Times Now Arnab Goswami రాత్రి అసలు ఆ విషయం గురించి తెలియని నలుగురిని పిలిచి,దాంట్లో ఇద్దరు తాంత్రికులు ఒకరు రాజు శతృవు ఇంకొకరు ఆ శత్రువు శత్రువు తో మంతనాలు చేస్తాడు, వాళ్ళ అభిప్రాయం ఏమిటో జనాలకు తెలియదు కానీ Arnab Goswami అభిప్రాయం మాత్రం తెలుస్తుంది.
ఇక ఈలోగా ఎవడో శత్రు రాజ్యం నాయకుడు దండోరా మొదలు పెడతాడు!
ఇప్పుడు వాడి అభిప్రాయం మేము ముందే చెప్పాము అని చంకలు గుద్దు కుంటారు.
ఇది చూసిన ప్రజలకు మాకు నిజం తెలియాలి అని ప్రశ్నిస్తారు కాదు కాదు, రాజు చేసింది తప్పు అంటారు, యాత్రలు మొదలు పెడతారు మానం పాటిస్తారు, ప్రచ్చన్న యుద్ధం ప్రకటిస్తారు!
దాంతో రాజుకు రాజ్య పాలనా సమయం కన్నా అబద్దాలను నిజాలను నిగ్గు తేల్చే పని పెరుగుతుంది, ఎందుకంటే రాజు తప్పు చేసిన చెయ్యక పోయినా తప్పు చేశాను అన్న భావన పెరిగిపోతుంది కాబట్టి!
ఇక దీన్నించి బయట పాడటానికి నిజనిర్ధారణ సంస్థ ను తాయారు చేస్తారు, అందులో అందరూ ముసలు వాళ్ళే. వాళ్లకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు! వాళ్లకు నిజం చెబుతారు అన్న నమ్మకం ఎవరికీ లేదు! నిజానికి అది ధనం వృధా చేసే ఇంకో సంస్థ!
గమనిక: నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను చరిత్ర నగ్గినోడు రాసుకున్న పొగడ్తల చెత్త కాగితం అని, ఇక్కడ జక్కన కధ నాకు చిత్రం లో ఉన్నదే తెలుసు, ఇది నిజం అయినా కాక పోయినా ప్రస్తుతం Media గురించి మాత్రం నిజం!