ఒక చిత్రం చూసాను అందులో తల్లి గర్భం లో పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుంది తండ్రి మెదడులో ఆలోచిస్తాడు! అంటే ఒక్కరే భారం మోయ్యట్లేదు అన్నట్లు ఉంది, నిజం కావొచ్చు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది!
ఒక్కొక్కరు ఒక్కో జాగ్రత్త చెబుతారు అందులో అన్నీ సమకూరుతాయో లేదో తెలియదు!
ఇంకొందరు వాంతులు గురించి చెబుతారు, ఇది నా ప్రస్తుత ౪ నెలల అనుభవంతో వ్రాస్తున్న సూచనలు
౧. వాంతులు ఎక్కువగా అవుతుంటే నారింజ, జామ కాయ తినిపించాలి అన్నారు కొన్ని సార్లు పనిచేశాయి కొన్నిసార్లు పని చెయ్యలేదు, కానీ ఎక్కువమార్లు పనిచేశాయి!
౨. మొదటి మూడు నెలలు వేడి చేసేవి తినిపించ కూడదంట.
౩. వాంతులు అయితే వెంటనే పండ్ల రసాలు పట్టించాలి.
౪. ఎక్కువగా దానిమ్మ తినిపించాలి.
౫. రక్త హీనత ఉన్నా లేక పోయినా తప్పని సరిగా carrot beetroot ఇంచుమించు రోజూ సమకూరేల చూడాలి!
౬. ఒక్కోసారి వాంతులు కు కారణం అజీర్తి, అందుకు పీచు పదార్థాలు పుష్కలంగా ఉండేవి తినిపించాలి, ఉదాహరణకు ఆకుకూరలు!
అన్నిటికన్నా ముఖ్యమైనది శుభ్రత, ఆమెకు మగవారు ఇవ్వగలిగిన కానుక అదే!
ఇవి కాకుండా కొన్ని చమత్కారమైన సూచనలు
౧. నల్లనివి తినకూడదు పిల్లలు నల్లగా పుడతారంట
౨. ఉసిరి తినకూడదు పై కారణమే!
ఇక కొన్ని భయాలు
౧. ఆమె కోరిన కోర్కెలు తీర్చక పొతే అవి ఎప్పటికీ తీరావంట
౨. కోర్కెలు ఎక్కువగా ఉన్నా మంచిది కాదంట!
మీకు ఇంకా తెలిస్తే జోడించ గలరు!