ఉండ కూడదు అనే అనుకుంటున్నా, కారణాలు అనేకం.
౧. గాంధీ గారి వీర విధేయులం అనే వారు గాంధి గారిని ఇంట్లో దాచేసుకుంటున్నారు, అర్ధం కాలేదా నల్ల ధనం!
౨. గాంధీ గారి వీర విధేయులు గాంధీ గారి మునుజూపు ప్రతులు ప్రజలకు పంచుతున్నారు, అర్ధం కాలేదా నకిలీ నోట్లు!
౩. గాంధీ గారి వీర శత్రువులు, గాంధీ గారిని ఉపయోగించి చెడ్డ పనులు చేస్తున్నారు, అర్ధం కాలేదా గుండాలు!
మరి గాంధీ గారిని చిత్రం తొలగిస్తే ఈ బాధ తప్పుతుందా అని మీరు అడగ వచ్చు, పూర్తిగా కాకపోయినా కొంత వరకూ తగ్గుతుంది, ఎందుకంటే వారి నాయకులను చూసి మోసాలు చేసే వాళ్ళు తగ్గుతారు. ఇక నకిలీ కాగితాలు చాలా తగ్గుతాయి, ఎందుకంటే కొత్త నోట్లు photo copy లు తియ్యడానికి కొంత సమయం పడుతుంది కదా!
లేదా, ప్రతీ ఒక్కరు తమ దగ్గర ఉన్న నోట్ల సంఖ్యలను అంతర్జాలం లో ఎక్కించా లి, దాంతో దొంగ నోట్ల బెడద తగ్గుతుంది!
గాంధీ ! నోటున జిక్కెన్
బ్రాందీ షాపుల గొడవల బారున జిక్కెన్
చాందిని నడిరేయి నడువ
లాందరు లేదుగద! యింతి లావును బోయెన్