మీ అందరికీ తెలిసినదే ఒకరికి దుర్వార్త ఇంకొకరికి శుభవార్త అవుతుంది అని.
ఇంతకీ ఆ దుర్వార్త ఏమిటి అంటే, మీకు payment fail అయితే డబ్బులు వెనకకి వస్తాయి. అది దుర్వార్త ఎలా అవుతుంది అనుకుంటున్నారా
నా గత అనుభవం నుంచీ చెబుతున్నాను, అది మీకు దుర్వార్తే, ఎందుకంటే మానవ నైజం ఏమిటి వస్తువు మీద నమ్మకం ఎక్కువ పెట్టుకోవడం, ఒక సారి payu money ద్వారా ప్రయాణానికి చెల్లింపు చేశాను, చెల్లింపు పూర్తీ కాలేదు, అదే కంగారులో మళ్ళీ చెల్లింపు చేసాను, ఈ మారు కూడా చెల్లింపు కాలేదు, సర్లే డబ్బులు వెనకకు వస్తాయి కదా అని వేరే విధానం ద్వారా చెల్లింపు చేసాను. అయిపొయింది.
ఇక bill తయారయ్యింది HDFC credit card ది. చూస్తే ఒక్క సారి డబ్బులు మాత్రమే తిరిగి వచ్చాయి రెండవ సారి విఫలమైన చెల్లింపు ప్రయత్నం తాలుకూ డబ్బులు రాలేదు, వాడిని అగిడితే మా దగ్గర ఉన్న చిట్టాలో ఒక్క మారు చెల్లింపు విఫలం అయ్యింది అని చూపిస్తుంది అన్నాడు, సరే payu money వాడిది తప్పేమో అని వాడికి వ్రాస్తే వాడు ఆ డబ్బులు మాకు రాలేదు అని చెప్పాడు, అప్పుడు HDFC వాడికి వ్రాస్తే మాకు తెలియదు అన్నాడు, ఇక కోపం తట్టుకోలేక consumer forum కు వెళతాను అనే సరికి చూస్తాం అన్నాడు, డబ్బులు రాలేదు నేను చెల్లింపు చెయ్యాల్సి వచ్చింది. మూడు నెలలు వాడికి phone చేస్తే డబ్బులు తిరిగి వచ్చాయి. ఇప్పుడు నాకు సమయం వృధా డబ్బు వృధా.
మరి ఇది investors ఎందుకు అనందించ వలిసిన విషయం అనా మీ అనుమానం, వాళ్ళే ఆనందించాలి ఎందుకంటే మూడు నెలలు వడ్డీ ఇవ్వకుండా డబ్బులు వాడి దగ్గర నిల్వ చేసుకున్నాడు, ఇక నేనైతే statement చూసుకున్నాను కాబట్టి కనీసం అసలు వచ్చింది మరి statement చూసుకొని వాళ్ళ డబ్బులు, అవి మనకు తిరిగి రావు, మీరు అడగ వచ్చు అది bank కూడా ఉపయోగించుకోలేదు కదా అని కానీ ఎప్పుడు, వార్షిక ఖాతా ముగింపు తర్వాత un claimed money reserve bank కు వెళుతుంది అంటే అప్పటి వరకూ ఉపయోగించుకుంటుంది కదా!
ఇక వినియోగ దారులరా మేల్కోండి !
Don’t use HDFC Credit card.