కొన్నిసార్లు ఎమ్మా ప్రతీ పనికి రెండు సామాన్లు వాడేది, ఉదారణకు
ఇడ్లీ కు పిండి రుబ్బితే ఇడ్లీ వేసేటప్పుడు కొంత పిండి వేరే దాన్లో వేసి ఉప్పు కలిపి ఇడ్లీ కి వాడేది! అదేంటమ్మా అని అడిగితే అవి ఇవి అన్నీ కలప కూడదు అని పెద్దలు చెప్పే వారు కాబట్టి కలపలేదు అనే వారు!
అందరి లాగా నాకూ చాదస్తం లాగా అనిపించేది, కానీ నిజం అది కాదు అని అనిపిస్తుంది!
నిన్న నేను విరిగిన గిన్నె పెట్టాను కదా మీరు చూసే ఉంటారు చూడక పొతే మళ్ళీ చూడండి
side-effects-os-salt
ఇది కారణం అనిపిస్తుంది, ఇక్కడ ఉప్పు కలిపిన పిండి నిలవ చేస్తే గిన్నెలు అలాగే బీటలు వస్తాయి. కారణం నాకు తెలియదు కానీ ఒక్కో మారు చాదస్తం కాదు అది మంచి జీవన విధానానికి మార్గం అనిపిస్తుంది,
మీరు కూడా చాదస్తం అని వాదించ కుండా అందులో మంచి కనపడక పొతే వాళ్ళ మార్గం మార్పించండి, మంచి కనిపిస్తే ఆచరించండి!