చెప్పను కదా కొన్ని రోజుల క్రితం కథ మొదలు పెడతాను అని, ఇప్పుడు మొదలు పెడుతున్నా, నిర్విఘ్నం గా వ్రాయాలి అని కోరుకుంటున్నా!
మన MLA కు కొంచం ఆధునికతను జోడించి జ్యోతిష్యం ను ఉపయోగించే అలవాటు చాలా ఎక్కువ!
ఒకసారి ఒక ప్రాంతీయ నాయకుడు తన party లో తన వాటా తనకు రావట్లేదు అని కొత్త వ్యక్తీ ని MLA చెయ్యడానికి శపథం పూనాడు.
ఆశా వాహులకోసం ప్రకటన ప్రచురించాడు.
అభ్యర్ధి కి ఉండ వలిసిన లక్షణాలు
1. మధ్య తరగతి వాడు కావలి.
2. నియోజక వర్గం లో 5 సంవత్సరాలుగా ఉండాలి
3. ప్రస్తుత MLA కు బంధువు కాకూడదు
4. ఒక్క bank ఖాతా మాత్రమే ఉండాలి
5. మూల ధనం 5 ల కన్నా తక్కువ ఉండాలి
చాలా మంది అభ్యర్ధులు తమ అభ్యర్ధిత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం మొదలు పెట్టారు.
జనాలకు మొదట ఆశ్చర్యం కలిగింది కానీ దరఖాస్తు చేసుకోవడం మాత్రం మానలేదు. ఇప్పుడు ఆ ప్రాంతీయ నాయకుడు అతని ఆట మొదలు పెట్టాడు!
ధరకాస్తు ధర నూరు రూపాయలు, ఏ ఒక్క నిభందన అతిక్రమించినా అభ్యర్ధి ధరకాస్తు తిరస్కరించ బడుతుంది.
ఒక లక్ష పైగా ధరకాస్తులు వచ్చాయి.
ప్రతీ అభ్యర్ధి తమ అస్తు పాస్తులు వివరాలు వెల్లడించారు. కొంతమంది ఆస్తులు ఎక్కువగా ఉండటంతో తిరస్కరించ బడ్డాయి.
ఇక MLA తన అభ్యర్ధిత్వం పోతుంది అని ఒక భయంతో బీర పీసు సంబంధాలు ఆ వచ్చిన అభ్యర్ధులకు చూపించడం మొదలు పెట్టాడు, అల ఇంకొందరి దరఖాస్తులు తిరస్కరించ బడ్డాయి.
ఆ ప్రాంతీయ నాయకుడు చాల ఆటలు మొదలు పెట్టాడు
అప్పటి వరకూ జీవిత భాగస్వామి ఆస్తుల గురించి చెప్పలేదు కాబట్టి జనాలు తమ పేర ఉన్న ఆస్తులు జీవిత భాగ స్వాముల మీదకు వ్రాసేసారు. ఇప్పుడు వెల్లడించాడు. ఇంకొంత మంది పోయారు.
తరువాత అప్పటి వరకు స్థలాలు ధరలు తక్కువగా ఉన్నాయి, valuation ధర బట్టి ధరకాస్తులో వ్రాసారు. కానీ నాయకుల తుత్తులు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఎవడైతే నాయకుల తుత్తులొ వాళ్ళే వెళ్లి తిరిగి valuation చేసి ధరలు అమాంతం పెంచేసారు.
ఇది చూస్తున్న ఒక జ్యోతిష్కుడు తన దగ్గరకు వచ్చిన ఒక మధ్య తరగతి వాడి చేత వాడికి తెలియకుండానే సంతకం పెట్టించి అభ్యర్ధిత్వం పంపించాడు.
ఆ ప్రాంతీయ నాయకుడు తొత్తులు అభ్యర్ధిత్వం వెయ్యడానికి వచ్చిన వాడి ఆస్తి పాస్తులు ధరలు పెంచేయ్యడం మొదలు పెట్టారు కానీ అభ్యర్ధిత్వం వేసిన వాడి ఆస్తి పాస్తులు చూడలేదు. జ్యోతిష్కుడు అభ్యర్ధిత్వం మీద సంతకం పెట్టించిన వాడి జాతకం, ఆ పత్రం నమోదు చెయ్యడానికి తీసుకు వెళ్ళిన వాడి జాతకం బాగా పరిశిలించి ఎన్నుకున్నారో ఏమో కానీ, ఆ మధ్య తరగతి వాడు అభ్యర్దిత్వం తరువాత స్థాయికి చేరుకున్నాడు, ఈ మధ్య తరగతి వాడు అనుకోని విధంగా ధన వంతుడు అయ్యాడు.
ఈ జ్యోతిష్కుడు మరి జరిగినది ఆయన చేసినది మరి ఆ మధ్య తరగతి వాడికి చెబుతాడా? అసలు ఈ జ్యోతిష్కుడికి ఆ మధ్య తరగతి వాడినే ఎందుకు ఎన్నుకున్నాడు? తరువాత చూద్దాం!
next episode eppudandi.. waiting..
వ్రాసానండి చూడండి