జై శ్రీరామ!!
మన కాబోయే MLA ఒక సాధారణ ఉద్యోగి, అతని ఆస్తి తరతరాల నుంచీ వస్తున్న సాంప్రదాయం. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్లకు ఇతనికి మధ్య తేడా, ఇతను సాంప్రదాయం ఎరిగి పని చేస్తాడు వాళ్ళు, ఏదో ఉంది అని పనిచేస్తారు.
ఇతని మంచి అలవాట్లు
విద్యుత్తు ఆదా చెయ్యడం, ఎలాగంటే సూర్య రశ్మి ఉన్నప్పుడే ఎక్కువ పనిచెయ్యడం!
మిగిలిన సమయం లో తక్కువ పని చెయ్యడం.
నీటిని ఆదా చెయ్యడం, అంటే ఇంట్లో ఉన్న బావిని ఎప్పటికీ మూయించలేదు, అందులో motor ఉన్నా నీళ్ళు తోడుకునే స్నానం చెయ్యడం.
చెట్లు మొక్కలు పెంచడం, ఇతనికి చెట్ల మీద మక్కువ అనడం కన్నా, అవి ఇచ్చే నీడ కోసం ఆరాటం, ఇంట్లో చెట్లు పుష్కలంగా ఉంటే మనిషికి AC అక్కర్లేదు కదా! కుదిరినప్పుడల్లా మొక్కలను ఎలా సంరక్షించాలి అనే విషయాలు చూసి చేస్తుండటం.
ఎక్కువ శాతం ఇంట్లో నే తినడం.
ఆర్భాటాలకు దూరంగా ఉండటం.
ఇంక అవలక్షణాలు:
మందు చుట్టా పుగాకు వ్యర్ధాల జోలికి వెళ్ళే వాళ్ళను ఆపడు, ఎందుకంటే తానూ తీసుకోవట్లేదు కాబట్టి అంటాడు!
ప్రేమ పెళ్ళిళ్ళు అస్సలు నచ్చవు, అతను ప్రేమలో విఫలం అయినందుకు కాదు, ప్రక్రుతి సహజంగా వచ్చే ప్రేమ అన్న చెల్లెళ్ళ ప్రేమ అని అతని నమ్మకం కాబట్టి అని అతను బావిస్తాడు కాబట్టి, అయినా అతని కారణాలు అతను MLA అయ్యాకా చేసే పనుల ద్వారా చెప్పుకుందాం.
ధనాన్ని stock market లో పెట్టడు, అదే అంటే అది investment కాదు అంటాడు!
యోగా చెయ్యాలి అని మాత్రమే అనుకుంటాడు!
అన్నిటికన్నా ముఖ్యంగా మంచి పనులు చేస్తాడు!
ఇక ఇతని అభిప్రాయాలు
గుడి ప్రాంగణం లో దుకాణాలు అంగడి ఉండకూడదు, గుడి చుట్టూ చెట్లు చేమలు ఉండాలి అంటాడు.
ప్రతీ ఇంటికీ ఇంకుడు గుంతలు కానీ బావి కానీ ఉండాలి అంటాడు.
చెట్లు నాటితే సరిపోదు చెట్లు పెంచాలి అంటాడు!
electric line భూగర్భం లో నుంచీ పోవాలి అంటాడు!
ఇల్లు కట్టాలి అంటే పర్యావరణ వేత్త అభిప్రాయం, ఊరి పెద్ద సంతకం ఉండాలి కానీ revenue అధికారి ఉండకూడదు అంటాడు!
Passport Voter ID లాంటి ధృవీకరణ పత్రాలు postal శాఖ వద్ద ఉండాలి కానీ revenue అధికారుల వద్ద ఉండకూడదు అంటాడు.
మరి వీటన్నిటిని చేస్తాడా చెయ్యడా ఎలా చేస్తాడు అన్న విషయాలు తరువాత చూద్దాం!