ఎవరూ రాత్రికి రాత్రి నాయకుడు కాలేడు!

నిజానికి నాయకుడిగా అతను అవుతాడు అని గురూజీ నమ్మడానికి కారణం, అతనిలోని స్తబ్ధత!

అతనికి చిన్నప్పటి నుంచీ తను నమ్మినదే నిజం అనుకునే నైజం, కానీ కాలం అన్ని వేళలా ఒకేలా ఉండదు కదా, అదే జరిగింది.

అతని తండ్రి revenue శాఖలో ఒక అధికారి, ఒక రోజు అతని తండ్రి ని కొంతమంది వచ్చి తప్పుడు లెక్కలు వ్రాయమంటారు! ఇష్టం లేక పోయినా తన కొడుకుని ఎదో చేస్తారు అని వ్రాస్తాడు. ఇది కొడుకుకి నచ్చదు. కానీ ఎదురించ గలిగే శక్తి ఉందా లేదు! ఒక రోజు తన పాఠశాల వ్యాస రచన పోటీలు జరుగుతుంటాయి, అందులో ఒక వ్యాసం అసలు అవినీతి ఎక్కడ మొదలయ్యింది అని! ఆ పోటీ న్యాయ నిర్ణేత లలో ఒకరు గురూజీ. అప్పుడే మన వాడు తన ప్రతిభను చూపించాడు.తన తండ్రి చేత చేయించిన తప్పును సవివరంగా వ్రాసాడు.

అది మీ కోసం కూడా

అవినీతి కి ఆజ్యం తెలివితేటలూ ప్రాంతీయ వాదం అని అందరూ అనుకుంటాం, కానీ తెలివిగా ఆ ప్రాంతంలో ఇద్దరి మధ్య నిప్పు రాజెయ్యడం, శత్రువును మిత్రునిగా నమ్మించే అభినయం. ప్రాంతీయ వాదం తరువాత పుట్టించడం. అదే ౨౦ మందిని ధనవంతులు గా చేసి ౮౦ మందిని నిత్యం శ్రమించే లాగా చేస్తుంది.

ఒక ఊరిలో బంధు మిత్ర సపరివారంగా వ్యవసాయం చేసుకుంటున్న ఒక రైతు కుటుంబం ఉంది, వారిని ఆదర్శంగా తీసుకుని ఇంకొంతమంది వ్యవసాయం సమిష్టిగా చేసుకుని దిగుబడి పెంచుకున్నారు, భూ సారం తగ్గకుండా ఊరిని ఆదర్శంగా ముందుకు తీసుకు వెళుతున్నారు. ఇది ఒక వ్యాపారికి శాస్త్ర వేత్తకు నచ్చలేదు. ఆ ఊర్లో అధిక దిగుబడి కారణం ఏమిటా అని అన్వేషించడం మొదలు పెట్టారు. వారికి దొరికిన కొన్ని ఊరు కట్టుబాట్లు ఆ ఊర్లో ఖాళీగా ౨౦ శాతం మందిని కూర్చో బెట్ట నివ్వట్లేదు అని అర్ధం అయ్యింది,వాళ్ళకు దొరికిన ఊరు కట్టుబాట్లు

ధనవంతుడు పేదవాడు ఎవరైనా ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలి. ధనవంతుడి పని విత్తనాలు దాయడం, గిడ్డంగులు నిర్వహించడం, పశువులు ను పెంచడం ఊరు లో ఉన్న చెరువును బాగు చేయించడం లాంటివి, వీళ్ళను అప్పట్లో జమిందారులు అనే వారు. ఇక పేద వారు మధ్య తరగతి వారు ఈ జమిందారు ఊరు పెద్దలు నిర్ణయించిన పనులు చెయ్యడం.

ఊరి పెద్దల మాట జమిందారు వినేవాడు, వాళ్ళు అనేక కాలాలు చూసిన వాళ్ళు. అందుకు వారికి ఎక్కువ తెలుసు అని నమ్మే వాళ్ళు ఊరు జనాలు, వాళ్ళు తప్పు చెప్తే ఊరి జనాలు అది ఎందుకు తప్పో ఎందుకు ఒప్పో చెప్పే వాళ్ళు, దాన్ని బట్టి నిర్ణయాలు మారేవి. పెత్తనం వేరే ఊరికి అప్పగించక పోవడం కూడా ఊర్లో సమతుల్యత దెబ్బ తినలేదు.

ఆ ఊర్లో ఎప్పుడూ పరిక్షలలో ఎక్కువ ప్రతిభ కనపరచిన వారిని దేవుళ్ళ గా చూసే వారు కాదు, వాళ్లకు ఊరును ఎలా కాపాడాలో తెలిసిన వాళ్ళే దేవుళ్ళు.

ఎందుకంటే ఆ ఊరి జనానికి చదువు ఊరిని బాగు చెయ్యట్లేదు అనే నమ్మకం బాగా పెరిగిపోయింది, ఏ పాఠ్య పుస్తకంలో కూడా ఊరి రక్షణ గురించి ఒక్క కథనం కూడా లేదు.

ఊరికి ప్రకృతి వైపరిత్యం రాకుండా ఎలా నివారించాలో ఏ పాఠ్య పుస్తకము విద్యార్ధులకు విసిదీకరించేది కాదు. ప్రతీ పాఠ్య పుస్తకం రాజనీతి ఆర్థికశాస్త్రం కోసం మాత్రం రచించ బడింది.

ఊరి ప్రజలకు ఆర్ధిక శాస్త్రం కన్నా అర్ధ శాస్త్రం మీదే మక్కువ ఎక్కువ. రెండూ ఒకటే కదా అని మీరు అంటారు, రెండూ ఒక్కటే, ఊరును కాపాడే అర్ధ శాస్త్రం ఎప్పటికీ పేరు ఎండదు కాబట్టి ఆ పేరు వాడను. ఆర్ధిక శాస్త్రం లో నువ్వు ధనవంతుడివి ఎలా కావాలో లేదా ధనవంతుడిని ఎలా కాపాడాలో ఉంటుంది, కానీ ఊరి అర్ధ శాస్త్రంలో ఊరిని ఎలా కాపాడాలో మెదడులో ఉంటుంది. ఆర్ధిక శాస్త్రం రాజనీతి రసాయన శాస్త్రం రాసిన చోటే అవసరం అనే నమ్మకం కూడా ఎక్కువ, ఇంకా చెప్పాలి అంటే రాసిన వాడిని ధనవంతుడిని చేసే ఒక శాస్త్రం. అందుకే ప్రభుత్వ నిభందన ఉల్లంగించ కూడదని ౧౦ వరకూ చదివించే వారు తర్వాత ఊరి అర్ధ శాస్త్రం నేర్పేవారు.

ఊరు అర్ధ శాస్త్రంలో అంశాలు

౧. ఊరి చెరువును ఎప్పుడు శుభ్రం చెయ్యాలి, ఎలా శుభ్రం చెయ్యాలి, ఊర్లో ఎన్ని చెరువులు ఉండాలి. వాళ్ళు సామాన్య ప్రజలు వారికి ఇల్లు , సామాన్లు మరియు మనుషులు శుభ్రం చేసుకోవడానికి నీరు కావాలి కానీ ఇంట్లో అనవసరమైన వస్తువులకు కాదు. పశువులను శుభ్రం చెయ్యడానికి కావాలి కాబట్టి వాళ్ళు ఊర్లో నాలుగు  చెరువులు నిర్మించు కున్నారు, రెండు చెరువులు మనుషుల నిత్య అవసరాలకు ఉపయోగించే వారు. వేసవి కాలంలో ఒక చెరువులో నీటిని ఇంకో చెరువులోకి పంపించి ఆ చెరువులో పూడికలు తీసేసి ఆ చెరువును శుభ్రం చేసే వారు తరువాత సంవత్సరం రెండవది, అలాగే పశువుల కోసం ఉపయోగించే చెరువులు కూడా.

౨. ఊర్లో చెత్త, ఆ ఊర్లో plastic నిషిద్దం, ఏ విధమైన ఆహరం కానీ సరుకులు కానీ ప్రకృతి జీర్ణించుకునే వస్తువుతోనే తయారవ్వాలి అన్నది అక్కడి వారి నిభందన. అందుకని పాలు ఇంటికి తీసుకు పోవాలి అన్నా కూరగాయలు ఇంటికి తీసుకు వెళ్ళాలి అన్నా గిన్నెలు లేదా గోనె సంచులు వాడే వారు. ఒక వేళ ఇక పని చెయ్యదు అంటే గిన్నెలకు మక్కు పెట్టించుకొని వాడుకోవచ్చు అంటే మక్కు పెట్టించుకుని వాడుకునే వారు లేదా కరిగించేసి వేరే వస్తువు తాయారు చేయించే వారు, ఇక గోనె సంచులు ను ఊరి లో చిన్న అడవి లో పాతి పెట్టె వారు, దాన్ని పోరంబోకు స్థలం అనే వారు, అక్కడ చెట్లు అవసరానికి నరికి చెట్లు అవ్వగలిగే మొక్కలు పాతే వారు. అక్కడ ఎక్కువగా వేప చెట్లు ఉండేవి.

౩. ఎరువులు,క్రిమి సంహారికలు  నిషిద్దం, వేప చెట్లు ఎక్కువగా ఉండటం వలన ఆ ఊర్లో జనాలు ఆ వేప ఆకును క్రిమి సంహరికంగా వాడే వారు, ఇక కుళ్ళిన పేడను ఎరువులుగా వాడే వారు.

౪. రాత్రుళ్ళు ఎవరూ బయట తిరగ కూడదు, రాత్రి దెయ్యం ఉంటుంది అని కాదు, మనం దెయ్యం చేష్టలు చేస్తాం అని ఊరి నమ్మకం. దెయ్యాల జీవనం వాటిని చూసిన వారిని భయ పెట్టడం. కేవలం తర్ఫీదు ఇచ్చిన వాళ్ళు మాత్రమే తిరగడం!

ఈ నియమాల వల్ల ధనవంతుడు కూడా పనిచెయ్యాల్సి వచ్చేది!

ఎప్పుడూ మనిషి కష్ట పడి బ్రతకడం ఇష్ట పడడు ఇది జగమెరిగిన సత్యం, కానీ ఇక్కడ జనులు దాన్ని అదుపులో ఉంచుకుని జీవించే వారు.

ఆ వ్యాపారికి శాస్త్రవేత్తకు ఒక మాంత్రికుడు కావాలి, అతనే psychiatrist అంటారు ఆంగ్లంలో, వాడి కోసం అన్వేషణ మొదలు పెట్టారు.

 

 

ఎవరూ రాత్రికి రాత్రి నాయకుడు కాలేడు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.