అతని వృత్తి ప్రజలను మోసగించడం, వాటిని మొదట్లో ప్రకటనలు అనేవారు.
ఆ మాంత్రికుడి పని ప్రజలకు ప్రకృతి ద్వారా దొరికే వాటితో లాభం లేదు అని చెప్పడం. ఆ మాంత్రికుడి ఈ వ్యాపారికి శాస్త్రవేత్త కు తోడుగా నిడగా నిలుస్తాను అన్నాడు.
మాంత్రికుడి పని, కుండతో వంట చెయ్యలేని వాళ్ళను పెట్టి, వంట చేయిస్తూ కుండలు బద్దలు కొట్టించడం, మొదట్లో జనాలకు వీళ్ళు మాయ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు అని పట్టించుకునే వారు కాదు. తరువాత తరువాత ప్రకృతి ధర్మం ప్రకారం కుండ పగిలిపోయినా లేదా ఎంత చెయ్యి తిరిగిన వారైనా ఒక్కోసారి గణితం లో తప్పి కుండలు బద్దలు కొట్టారు, దాంతో ఈ బద్దలు కొట్టిన వారు యంత్రికుడి మాయలో పడి Aluminium వంట సామాగ్రి కొన్నారు, పెద్దలు ఎంత వారించినా వినలేదు, దాంతో కుండలు చేసే వాడికి పనిపోయింది, అతను ఆ ధనవంతుడైన వ్యాపారి వద్ద శుభ్రం చేసే పనికి చేరాడు. ఇక ప్రజలకు రోగాలు రావడం మొదలయ్యాయి. ప్రజలు సౌఖ్యం చూస్తారు కానీ కారణం చూడరు, కాబట్టి ఇప్పుడు శాస్త్రవేత్త తన పాచిక విసిరాడు.
ప్రజలకు Aluminium వల్ల నష్టాలు చెప్పి steel వాడించాడు. ప్రజలకు సౌఖ్యం ఇంకా పెరగడంతో ఇనప మూకుడ్లు ఇనప సామాన్లు వాడటం మానేసి వీటిని వాడటం మొదలు పెట్టారు.
ఇప్పుడు మళ్ళీ వ్యాపారి వంతు, ఈ సారి వ్యాపారి వైద్యుడిని తీసుకు వచ్చి, తనేదో పాప పరిహారం చేస్తున్నాడు అన్నట్లు అందరికీ రక్త పరీక్ష నిర్వహించాడు, అందరికీ Haemoglobin శాతం తక్కువ ఉంది అని ప్రకటించి ఇనుప మాత్రలు అమ్మడం మొదలు పెట్టాడు. ఇలా మొత్తానికి ఊరుని దోచుకోవడం వారికి పరిపాటే అయ్యింది.
ఇలా కలం గడిచింది, ప్రజలకు ఇద్దరూ అబద్దాలు చెబుతున్నారు అని తెలిసిన ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నారు, ఎందుకంటే కమ్మరి కంసాలి కుమ్మరి అందరూ ఆ వ్యాపారి ఇంట్లో పని వాళ్ళుగా మారిపోయారు, లేదా శాస్త్రవేత్త ప్రయోగాలకు నశించి పోయారు.
అన్నిటికన్నా దారుణం మాంత్రికుడి మాటల వలలో చిక్కుకు పోయారు. సులభం అనే పదం ప్రజల గుండెల్లో కి వెళ్ళి పోయింది. కానీ ఈ ప్రజలు ఏదో ఒకరోజు కళ్ళు తెరుచుకుంటారు అని ఈ ముగ్గురూ, ఊరే మనం కొనేస్తే ఎలాఉంటుంది అని అలోచించి ….