ప్రకృతి ధర్మం ప్రకారం నలుపుకి చెడు ఆకర్షించే గుణం ఎక్కువ ఉంటుంది, కానీ జనాలకు ఇప్పుడు నల్లని వస్త్రాల మీదే మక్కువ విపరీతంగా పెరిగిపోయింది, చిత్ర పరిశ్రమ ఒక కొత్త ఊపు కనిపరిచింది దాంతో ప్రజల్లో చిత్రాల మీద మక్కువ పెరగడం, ఒకప్పుడు సాంఘిక నాటకాలకు పెద్ద పీట వేసే వారు, కానీ ఇప్పుడు అసాంఘిక నాటకాల మీద మక్కువ విపరీతంగా పెరిగిపోయింది, దీనికి కారణం ప్రజల్లో పగలు కంటే రాత్రే ఎక్కువ పనిచేస్తాం అనే అపనమ్మకం. ఇది ఎంత పరిగిపోయింది అంటే జనాలకు పగలే చీకటి తెచ్చుకుని తరువాత వెలుతురు లేదు అని బాధ పడేటంతగా!
నలుపు మీద మక్కువ పెంచుకోవడం వలన జనాలు తమ శరీరంలోకి చెడును గ్రహిస్తున్నారు, మనం శివుడి అంత శక్తి వంతులం కాదు అని ఎప్పుడో గ్రహించడం కూడా మానేశాం!
జనాలకు మనిషి బ్రతకడానికి కావలిసిన వస్తువుల మీద అవగాహనా ఎప్పుడో పోయింది, ఒకప్పుడు తినడానికి తిండి త్రాగడానికి మంచినీరు ఉండటానికి ఇల్లు అవసరాలు కానీ ఇప్పుడు చీకటి మీద ఇష్టంతో కాబోలు, తినడానికి Table త్రాగడానికి Tupperware bottle ఉండటానికి duplex ఇల్లు కావాలి అని కోరుకోవడం మొదలు పెట్టాడు, దీనికి కారణం ఆ నలుగురు వాళ్ళు వ్యాపారి శాస్త్రవేత్త నటుడు మాంత్రికుడు!
ఎవరు ఎన్ని చెప్పినా అది మీకాలంలో కుడురుతాది ఈకాలంలో కాదు అనే వాళ్ళే!
ఇప్పుడు ఇంకా కొత్తగా మనిషి పంతాలు తారాస్థాయికి చేరుకున్నాయి, అమ్మే వాడు తెల్లనోడు కావాలి, నల్లనోడైతే బట్టలుకు వాడి రంగు అంటుకుంటుంది అనే అనుమానం!
బట్టలు నలుపే కానీ అమ్మేవాడు తెల్లగా ఉండాలి! అంటే ఈ ప్రపంచంలో నలుపు ఉండకూడదు అనే అభిప్రాయం కూడా!
ఇలా ఆటను వ్రాసిన వ్యాసరచన ముగించాడు, ఇప్పుడు judges వంతు, ప్రతీ వ్యాసరచన ఎంత పెద్దది ఉంది అన్నదే మొదటి నిభందన కాబట్టి ఈ యువకుడి ఓడిపోయాడు!
కానీ గురువు గారికి మాత్రం నల్లనోడే గెలిచాడు! నల్లనోడు నల్లగా ఉంటాడు!