భారతం భాగవతం రామాయణం ఏది తీసుకున్నా ప్రజలకు దేవుడు చేసినది తప్పు అనే ధ్యాస ఉండనే ఉంటుంది, కానీ మన ఈ అభ్యర్ధికి తనను తానూ ఆ స్థానంలో ఉంచుకుని బేరీజు వేసుకోవడం చాలా అలవాటు!
భాగవతం ప్రకారం భీష్ముడు కురు వృద్ధుడు పితామహుడు, కానీ ఆడిన మాట తప్పని ఒక మనిషి. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం పీఠం మీద ఉన్నవారికే తను కట్టుబడి ఉండాలి, అదే ఆయన చేసిన తప్పు. ధర్మం అంటే తను చేసిన ప్రతిజ్ఞ కాదు అని ఆయన నమ్మలేదు! ధర్మం గా నిలబడటం అంటే సత్యంతో నిలబడటం అని ఆయన నమ్మినా కేవలం తన స్వధర్మనికే కట్టుబడి ఉన్నారు! ఇక్కడ ఎవరిదీ తప్పు? అది కాదు మన నల్లనయ్య మొత్తం భాగవతంలో ఒక్కటే నీతి చెప్పారు, నిజాన్ని గెలిపించడానికి మధ్యే మార్గం అప్పుడప్పడు శరణ్యం అని.
అది నిజం అని మన అభ్యర్ధి బలంగా నమ్ముతాడు!
మన అభ్యర్ధికి నల్లనయ్య చెప్పిన ప్రతీ విషయం మీద ఒక అవగాహనా ఉంది! కానీ ఎప్పుడు ఆచరించాలో తెలియదు!
కురుక్షేత్రం అధర్మ యుద్ధం అని హేళన చేసే వాళ్ళకు మన అభ్యర్ధికి ఒక్కటే తేడా, ధర్మ యుద్ధం అధర్మ యుద్ధం కన్నా యుద్దంలో అంపశయ్య ఎక్కినా భీష్మ పితామహుల నుంచీ యుద్ధం ముగిసాక చనిపోయిన పాండవుల కుమారుల వరకూ అందరూ తమ శక్తితో ప్రపంచాన్ని నడిపించ గలిగి కూడా అహం ఆశ బంధు ప్రీతి కోపం ద్వేషం తో శత్రు వినాశనం కోరుకున్న వారు!
యుద్ధం చేస్తే అది శత్రు వినాశనం కోరుకోకూడదు శత్రువులో మార్పు తేవాలి అని నమ్ముతాడు మన అభ్యర్ధి!
మన అభ్యర్ధికి తెలిసిన రాజనీతి ఒక్కటే శత్రువు అనేవాడు ఉండాలి, కానీ వాడి చేతే తను చేసే మంచిని చెప్పించాలి!
ఇక మన అభ్యర్ధికి నిభంధనల ప్రకారం రేపు interview మరి ఎలా నేగ్గుతాడో చూద్దాం!