ఇప్పుడు మన అభ్యర్ధికి interview!
అందరికన్నా ముందే వస్తే ఎక్కడ ఎన్నుకుంటారో అని చాలా ఆలశ్యంగా వచ్చాడు!
అప్పుడే నెగ్గేశాడు, ప్రస్తుతం నాయకులకు ఉండాల్సిన ముఖ్య లక్షణం తనని ఎన్నుకునే వాళ్లకు ఎన్నుకున్న వాళ్లకు కనిపించక పోవడం!
అప్పటికే CPI నాయకులం అవుదాం అని వచ్చి న వారి సమాధానాలు వినివిని party నాయకత్వం మూర్ఛ బోయింది, అది మన అభ్యర్ధికి తెలియదు.
ఇక మన అభ్యర్థి వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా తప్పు సమాధానం చెబుదాం, దాంతో తీసుకోరు అని ఒక ధృడ నిశ్చయం తో వచ్ఛేసాడు.
ఇప్పుడు ప్రశ్న లు మొదలు పెట్టారు!
మొదటి ప్రశ్న
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి అని ప్రజలు అంటే నువ్వు ఏమి సమాధానం చెబుతావు?
అమ్మే వాడు ప్రత్యర్థి party కు చెందిన అభ్యర్థి, నేను ఏమీ చేయలేక పోతున్నాను, విదేశాల నుంచీ కొని తీసుకు వచ్చి ధర అదుపు చేస్తాను!
నాయకత్వం కు కొంచం హుషారు వచ్చింది! ఇలాంటి వాడే మనకు కావాలి అని అనుకున్నారు!
రెండవ ప్రశ్న
రహదారులు వేయించట్లేదు అంటే నువ్వు ఏమి చేస్తావు?
అక్కడ industrial estate ప్రకటిస్తాను!
అబ్బో ఆరితేరి పోయాడే అనుకున్నది నాయకత్వం!
మూడవ ప్రశ్న
అలా చెప్తే ప్రజలు ఎందుకు శాంతిస్తారు?
ప్రజలకు తెలుసు నాయకులు కొంతమందిని ధనవంతులను చేసే పనిలో ముందు వుంటారు, దాంతో industrial ఎస్టేట్ వస్తుంది అని నమ్ముతారు! ఈలోగా మన వీరాభిమాని ఒకడు అక్కడ ప్రజలలోకి వెళ్లి అసలు industrial ఎస్టేట్ వస్తే ప్రజలు ఎలా లాభ పడతారో వెళ్లి వివరించడం మొదలు పెడతాడు! అందరికీ నిత్యావసరాలు దొరుకుతాయి అని మభ్య పెడతాడు!
నాలుగవ ప్రశ్న
అలా చెప్తే ప్రజలు ముందే ఎక్కువ ధరకు స్థలాలు అమ్మడం మొదలు పెట్టేస్తారు కదా?
ఆ ప్రజలు ఉండేది బంజరు భూములే పట్టాలు ఉండవు ముందే మన అభ్యర్థులకు పట్టాలు ఇప్పించేస్తాం! దాంతో మన పార్టీ కు సంభంధం ఉండదు అది వాడు ఖాళీ చేయించు కుంటాడు!
ఇలాంటివాడే మనకు కావాలి అనుకున్నారు నాయకత్వం!
అయిదవ ప్రశ్న
కూరలు పండ్లు సహజత్వానికి దూరంగా దొరుకుతున్నాయి అని ప్రజలు ప్రశ్నిస్తే ఏమి చేస్తారు?
మీ ప్రశ్న ప్రస్తుతం దొరికే సీతాఫలం గురించే కదా? ప్రజలు అడుగుతూనే ఉంటారు, కానీ దొడ్డి దారిలో విదేశాలలో పండే పళ్లకు మంచి పోషక విలువలు ఉంటాయి అని ప్రజలను మభ్య పెట్టించే వ్రాతలు వార్తా పత్రికలలో వ్రాయిస్తాను, దాంతో ప్రజలు ఎలాగూ మారిపోతారు సీతాఫలం ఎలా ఉన్నా తింటారు, ప్రజలు ఈ ప్రశ్న వెయ్యడం మానేస్తారు!
తరువాత ప్రశ్నలు తర్వాత!