అనగనగా ఒక చిన్న కథ చెబుతాను, ఒక రాజ్యం ఒకటి ఉండేది, ఆ రాజ్యంలో జనాభా ఎక్కువయ్యారు, దాంతో ఏమి చెయ్యాలో అర్ధం కాక సూర్యుడు అస్తమించని రాజ్యం ఒకటి గా తయారు చేశారు!
దాంతో ప్రజలకు డబ్బు విందు విలాసాలు అన్నీ సమకూరాయి!
కాలం గడిచింది ఆ రాజ్యం చిన్నా భిన్నం అయ్యింది, దాన్నే అప్పుడు స్వతంత్రం అన్నారు! అది నిజమే!
ఇప్పుడు ఆ రాజ్యానికి అనంతమైన సంపద ఉంది, ఇప్పుడు ఆ సంపద మీద చాలా మంది కన్ను పడింది! దోచుకున్న సొమ్ము అయినా కూడా తమకే సొంతం కావాలి అని ప్రయత్నించడం మొదలు పెట్టారు! అది బైట వారు అంటే ఇప్పుడు సూర్యుడు అస్తమించని రాజ్యం అనేక రాజులతో కలిసి ఉంది! లోపలి వారకు అప్పుడు తాము చేసిన దోపిడీలు గుర్తుకు రాలేదు కానీ తాము దోపిడీ చేసిన సొమ్మును ఇంకొకరు దోపిడీ చేస్తున్నారు అని భయం మొదలయ్యింది! వెంటనే Brexit అన్నారు!
ఇంకోరకంగా చెప్పాలి అంటే ఆలీ బాబా నలభై దొంగలు కథ లాగా! ఇక్కడ గమమించ వలసిన విషయం దోచుకున్న వారి దగ్గర దోచుకుంటున్నది వేరే దేశస్తుడు, దోచుకోబడ్డ వాడు కాదు! ఇది రెండవ కారణం Brexit అనడానికి!
మూడవ కారణం, వలసలు ఇదనటం కన్న బద్ధకం తమ ముడ్డి ఇంకొకరి చేత కడిగించు కోవడం! ఇప్పుడు బద్ధకం వదిలించు కుంటాం అని Brexit అన్నారు!
మరి మన మీద ప్రభావం?
మన పెద్దలు ఎప్పుడూ చెప్పే మాటే కష్టే ఫలే! కష్ట పది నీ పండ్లు నువ్వే పండించు కో!(ఇది నా అర్ధం!). అంటే ఇళ్ళు కడుతూ పోవద్దు, పొలాలను పాడి పంటల కోసం ఉంచు అని నా అభిప్రాయం!
ఎప్పట్లాగే జనులారా, వస్తువు కొనడానికి బంగారం కొనండి కానీ ముడి సరుకుగా బంగారం కొనద్దు!