అందరం చైనా వస్తువులు కొనడం మానేద్దాం!
సాధ్యమేనా?
అంటే కాదు, నాశిరకం వస్తువులు కొనడం మానేద్దాం! అందులో ముఖ్యంగా చైనా లో తయారైనవి! గతంలో ఒకసారి చెప్పాను అమెరికా తన అగ్ర రాజ్య హోదా కోల్పోతుంది అనే భయంతో చైనీయులను HW రంగం లో అభివృద్ది చెందేలా భారతీయులను SW రంగంలో అభివృద్ది చెందేలా వ్యూహం రచించింది!
ఇందులో తప్పు చైనా ది ఎంతో భారతా వనిది కూడా అంతే!
అసలు చైనా వస్తువులు ఎందుకు కొనకూడదు?
కారణాలు అనేకం
మొదటిది, సరిగ్గా నాణ్యత పరిశీలించి తయారు చేసినవి తక్కువ
రెండవది, చైనీయులు ప్రపంచం నుంచీ తుక్కు తమ దేశానికీ తెచ్చు కుని దాంతో సామాగ్రి తయారు చేస్తున్నారు, ఆ చెత్తలో ఏముందో చైనీయులు చూడట్లేదు, ఒకప్పుడు పాలపొడి విషయం గుర్తుందా?
మూడవది, వాతావరణం, ఏదైనా పత్రిక చూస్తె చైనీయుల జీవన విధానం లో పురుగులు ఆహరం, వాటి వల్ల జనాలకి నష్టం, కానీ వాళ్ళు ఎలా ఉండగలుగు తున్నారు, వాళ్ళ పర్యావరణ విధానం వల్ల ఆ ఆహారాలు వాళ్లకు అరుగుతాయి. అందుకని వాళ్లకు అరిగింది మనకు అరుగుతాది అంటే అది మూర్ఖత్వం !
నాలుగు , బ్రహ్మపుత్ర/పారిశ్రామికీకరణ, ఇది చైనీయులనే కాదు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తున్న ఆర్ధిక విధానం. ఒకప్పుడు ఎవరి ఆహారం వాళ్ళే పండించుకునే వారు, ఇప్పుడు ౮౦% మంది ఆహారం ౨౦% మంది తయారు చేస్తున్నారు, దాని వల్ల నీటి యుద్ధాలు. మనం చైనా వస్తువులు కొనడం మానేస్తే చైనీయులు పారిశ్రామికీ కరణ తగ్గిస్తారు, దాని వల్ల నీటి లభ్యత పెరుగుతుంది, అందరికీ ఆహారం అందుతుంది!
ఇవి నాకు తెలిసినవి, అన్నిటినీ మానేయ్యలెం అన్నది జగమెరిగిన సత్యం, నీకు హాని చేస్తుంది అన్న వాటిని మానేయ్! తక్కువకు దొరికినా, plastic బొమ్మలు అస్సలు వద్దు! చైనవైనా భారత దేశంలో తయారైన వైనా!