నేను నా పరివారంతో కలిసి చాలా రోజులు అయ్యింది!
ఒక వారం రోజులు శెలవు పెట్టి తీర్ధ యాత్రలు పూర్తి చేద్దాం అనుకుంటున్నాను!
నేను అనుకుంటున్నా ప్రణాళిక వివరాలు
మొదటి రోజు రాజోలు లో బయలు దేరి, భద్రాచలం వెళ్ళి కోదండ రామాలయం దర్శించుకుని అక్కడ ఆ రాత్రి విశ్రమించి తరువాత రోజు(రెండవ రోజు) ఉదయాన్నే అన్నవరం వెళ్లి సత్యదేవుని వ్రతం భూని తరువాత సింహాచలం చేరి ఆ రాత్రి అక్కడ విశ్రమించి, మరునాటి(మూడవ రోజు) ఉదయం సింహాచలం నారసింహుని దర్శనం చేసుకుని, ఆ రోజు విజయవాడ బయలు దేరి విజయవాడ లో ఆ రాత్రి విశ్రమించి, తదుపరి ఉదయం(నాల్గవ రోజు) కనక దుర్గ అమ్మవారిని దర్శించుకుని, దర్శనం తరువాత శ్రీశైలం బయలుదేరి, అయిదవ రోజు శ్రీశైలం జగదాంబ అమ్మవారిని శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని, ఆరవ రోజుకు తిరుపతి చేరుకుని. ఆరవ రోజు ఉదయం కాణిపాకం వినాయకుడిని దర్శించుకుని, తరువాత కపిలతీర్థం లో కపిలేశ్వరుని దర్శించుకుని, తరువాత తిరుచానూరు అమ్మ వారిని దర్శించుకుని, తరువాత కోదండ రాముల వారిని దర్శించుకుని, రాత్రికి తిరుపతి వెళ్లి ఉదయాన్నే స్వామి వారి కళ్యాణం చూసి వేంకటేశ్వరుని ఆశీస్సులు పొంది, కిందకి వచ్చి తిరుగు ప్రయాణం!
మరి చూడాలి ఎంత మందికి కుదురుతుందో!