౫౦ రూపాయల దర్శనం చీటీ లు తీసేసారు!
మీ దివ్య రూపం చూడడానికి మేము శీఘ్ర లఘు దర్శనం చేసుకోవాలా?
ఇదివరకు తిరుమల కు వస్తే చెట్లు కనిపించేవి, ఇప్పుడు మనుషులు ఇళ్లు మాత్రమే కనిపిస్తు వున్నాయి, వృక్షో రక్షతి రక్షితః, కేవలం అలంకరణకు మాత్రమే అన్నట్లు ఉంది, ఇప్పుడు ఇళ్ళు తప్ప ఇంక ఏమీ లేవు!
ధర లు అమాంతం పెంచుతారు, సామాన్యులకు ఏమీ చెయ్యట్లేదు. ధనవంతులు కోసం కూడా పని చెయ్యట్లేదు.
మాకు నీ సేవ లు చేసుకొనే భాగ్యం కలిపించు స్వామి!
నేను ఇప్పటి వరకూ చేసుకోని సేవ ల జాబితా
సు ప్రభాతం
ఊంజల్ సేవ
తిరుప్పావడ
అష్ట దళ పాద పద్మ అర్చన
సహస్రకలశ అభిషేకం
మేల్ చాట్ వస్త్రం
ఇక నా శ్రీమతి అయితే
పైవి ఎలాగు చేసుకోలేదు, మిగిలిన వి కూడా చూసి తరించలేదు!
కరుణ చూపించు స్వామి!
ధరలు తగ్గించు!