అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.ఇప్పుడు మీకోసం కొంనో ఉచితంగా అందిస్తున్న వార్తలు
విదేశీ వస్తువుల మీద భారీ రాయితీలు.
విదేశీ వార్తకుడి site లో భారతీయుల తయారీ ఉత్పత్తులు మీద రాయితీలు.
స్వదేశీ వర్తకుడు విదేశి వస్తువుల మీద రాయితీ
Made in India పైన ముద్రణ లోపల విదేశీ సరుకులు, వాటి మీద రాయితీలు.
కొన్ని రోజుల క్రితం ఒకరు సందేశం పంపారు మన దేశాన్ని మనం మరచి పోవాలి అంటే ఏంటో
మంచి సందేశం…
ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట సేపు పాటు కొంచెం డబ్బు పంపటం కోసం bank లో వేచి ఉన్నాడు. తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు,
"భావజీ, మీరు internet banking ఎందుకని activate చేసుకోరు?"
"ఎందుకు చేయించుకోవాలి" అని తండ్రి తిరుగు ప్రశ్నించారు.
"ఇలా ఇక్కడ గంట సేపు transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా online లో ఇంటికే తెప్పించుకోవచ్చు".
తండ్రిని internet banking ప్రపంచంలోకి తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.
తండ్రి అడిగెను, "అలా చేస్తే నేను ఇంట్లో నుండి బయటకు రావాల్సిన అవసరం లేదు కదా??"
"హ హ, ఆవును అవును", అని కొడుకు జాబిచ్చెను. "ఇంకా ఇంటికి కిరాణా సామాన్లు, ఇంటికి కావాల్సిన వస్తువులు ఇలా ఎన్నో తెప్పించుకువచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి", అని వివరించే ప్రయత్నం చేసాడు.
తండ్రి ఇచ్చిన సమాధానానికి కొడుకు కి ఇంక మాటల్లేవ్.
ఏమని అంటే,
"నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను. ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను.
నీకు తెలుసు నేను ఒంటరివాడిని. నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే. నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచాయల్ని పెంచుకుంటాను.
రెండు సంవత్సరాల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చి, నాకోసం బాధపడి, కన్నీళ్లు కార్చి, నేను బాగు అవ్వాలని కోరుకున్నాడు.
కొన్ని రోజుల క్రితం, అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టు వాడు, తన బండి తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు.
నువ్వన్నట్టు online లో shopping లు అవి చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా? పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా? అమ్మని కిరాణా కొట్టువాడు ఇంటికి చేర్చగలిగేవాడా???
ఒక computer లేదా mobile phone తో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుని నాకు దొరికే స్నేహితుడు ఎవడు, ఒక electronic పరికారమా!!!
నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడటం ఇష్టం. నాకు ఇవన్నీ నువ్వనే ఆ amazon flipkart లో దొరుకుతాయా, కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనీషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలు బలమవుతాయి.
టెక్నాలజీ ఉండాలి కానీ ఆ ఒక్కటే జీవితం కాదు.
మనుషులతో జీవించండి, పరికరాలను వాడండి.
మనుషుల్ని వాడి , పరికరాలతో జీవించకండి".
Happy Independence Day
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🇮🇳