ఏమో నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది.
కారణాలు అనేకం.
స్వామివారికి నైవేద్యంగా ఫలహారాలు పెట్టరు అని అనుకుంటా. ఎందుకంటే ఈ రోజు ఇంకో 500 వసతి గృహాలకు అనుమతిని ఇచ్చారు. అంటే చెట్లు నరకాలి.
చెట్లు నరికితే పండ్లు ఎందుకు నైవేద్యంగా పెట్టరు అని మీకు అనుమానం కదా, ఎందుకంటే చెట్లు నరికి ఇల్లు కడతారు, ఇంట్లో చెత్త ఎక్కడ వేస్తారు రోడ్లమీద మరి ఆ చెత్తంతా ఎక్కడ పడేస్తారు, ఇంకొన్ని చెట్లు నరుకుతారు అది సరిపోదు ఇంకొన్ని, ఇలా తిలా పాపం తలా పిడకెడు అన్నట్లు ఇంకొన్ని రోజులకు అవి సరిపోక స్వామి వారి పండ్ల తోటలు నరికేస్తారు, అల స్వామి వారికి పండ్ల నైవేద్యం జరగదు.
కుదిరితే కట్టి ఉపయోగించని టోకెన్ సెంటర్ లను నివాసయోగ్యమైన ప్రదేశాలుగా మార్చండి, కొత్తవి కట్ట వద్దు, బాలాజీ బస్టాండ్ దగ్గర ఖాళీ స్థలంలో చెట్లు పెంచండి.
ఇది వరకు అక్కడ luggage checking జరిగేది, ఇప్పుడు, లేదా చెరువు తవ్వండి.
మీరు చదవరు కాబట్టే title “వెంకన్న కు ఇక కైంకర్యాలు జరగవా?” అని పెట్టాను.
How TTD works?
సింహాచలం వెళ్ళండి తెలుస్తాది.
రద్దీ లేని చోట్ల barcade పెట్టి కృత్రిమంగా రద్దీ సృష్టించి జనల కోసం చేశాం అంటున్నారు.
అది ఎలా చేశారు అనే కదా మీ ప్రశ్న
4 ఒకేసారి వెళ్ళ గలిగే ద్వారాన్ని 3 భాగాలుగా విభజించారు
1 లోపలకు పోవు దారి
2 VIP లకు దారి(ఎల్లప్పుడూ ఖాళీ)
3 వెలుపలకు వచ్చు మార్గం
ఈ రకంగా రద్దీ పెంచి భక్తుల సౌకర్యార్థం కొత్తగా భవనము లు నిర్మించి తిరి.
నమో వేంటేశాయ నమో శ్రీనివాస
వేంకటేశ తిరుమల గిరులు నిత్య కళ్యాణం పచ్చ(plastic కాదు) తోరణం గా ఎప్పుడు చూస్తాము స్వామి?