మా పల్లెటూరిలో మా అమ్మ నాన్నలకు ఈ మహమ్మారి వచ్చింది, వారితో నా అన్నయ్య వదిన పిల్లలతో వుంటున్నాడు.
కొందరి ఉచిత సలహాలు
మీ అన్నయ్యను పిల్లలతో కలిసి వాళ్ళ అత్తగారి ఉరుకు వెళ్ళమనండి.
నేను ఎలా చెప్పగలను వాళ్లకు, వాళ్ళ కు ఉండాలి అంటే ఉంటారు లేకపోతె ఉండరు.
సరి ఈ విషయం పక్కన పెడితే, ఈ మహమ్మారి అందరికి వెంటనే కనిపించట్లేదు అని WHO మొత్తుకుంటుంది, మా అమ్మానాన్నలకు వచ్చింది అంటే అక్కడ ఉన్న వాళ్లకు కొంచం వచ్చే అవకాశం ఉంది కదా, ఇప్పుడు మా వదిన అన్నయ్యలు వెళితే వారు ఈ మహమ్మారి వాహకులు గా మారచ్చేమో, వాళ్ళు వాహకులుగా మారితే వాళ్ళ వల్ల వేరే వాళ్లకు వస్తే వాళ్ళు మా అన్న వదినలు తిట్టుకోరా?
ఆలా కాకుండా వాళ్ళ అత్తా మామలు ఉండే ఊరులో వైద్యులు లేరు, ఇప్పుడు వాళ్లకు ఈ వానాకాలం లో ఎవరు తోడుగా ఉంటారు?
ఇది కాకుండా ఏరకంగా నేను అన్నయ్యకు అమ్మ నాన్నను వదిలి వెళ్ళండి అని చెప్పగలను?
వాళ్లకు నేను ఇచ్చిన సమాధానం, నేను ఎలా చెప్తాను అని, అంతే నా మీద కోపం, ఎవరితో చెప్పుకోలేక మీకు చెప్తున్నాను.
మీకు నేను చెప్పింది సరైనది అనిపించినా అనిపించక పోయిన నేను చేసింది తప్పు కాదు, ఎందుకంటే మా నాన్నగారికి ఓపిక ఎక్కువ, దూరం భరించే శక్తి, అమ్మకు తక్కువ.