Join Friends

వీటన్నింటినీ పోగొట్టాలి, అంటే ఊర్లో చాలా మార్పులు చెయ్యాలి. మొట్టమొదటి ఊర్లో జనాలు సంప్రదాయాల మీద ఉండ కూడదు.

1. ఆడవాళ్ళు చీరలు వాడకూడదు

2. మగవాళ్ళు పంచెలు లుంగీలు కట్టకూడదు

3. పిల్లలు పెద్దలు ఊర్లో ధర్జీల దగ్గర బట్టలు కుట్టించుకోకూడదు.

4. ప్రజలకు కష్ట పడి పనిచెయ్యని వస్తువులు చూపించాలి.

5. ఎరువులు ఎక్కువ వాడింప చెయ్యాలి.

వీటన్నిటినే అమలు చెయ్యాలి అంటే మొదట ప్రజలలో వాళ్ళు అమ్ముతున్న వస్తువులు ప్రజలకు సహాయం చేస్తాయి అన్నట్లు నిరూపించాలి, ఉదాహరణకు

పనిచేసే వాళ్ళకు చీరలు ఎందుకు అడ్డం అని చూపించాలి, లుంగీలు హుందాతనం ఎందుకు చూపించవో ప్రజలను మభ్య పెట్టాలి, మగవాళ్ళను లొభరుచుకునె చెత్త బట్టలు కొంతమంది మహిళకు అందించాలి.

అప్పుడే మొదలయ్యింది చిత్ర పరిశ్రమ, మొదట్లో ప్రజల కోసం అని ఉండేది, ప్రజల సాధక బాధకాలు చూపించేవి పోను పోనూ ఒక మోసధోరణి మొదలయ్యింది, వాటిలో కొన్ని

ప్రేమ పెళ్ళిళ్ళు మంచిది అన్నట్టు

ఒక్కడు వెళ్లి వంద మందిని చంపినట్లు.

ప్రజలు కూడా అదే అలవాటు పడ్డారు, కొన్ని రోజుల క్రితం ఒక చిత్రం, అందులో ఒక సంభాషణ క్లుప్తంగా

నిన్ను ఇదివరకు బట్టలలో ఎవరైనా చూసేవారా? ఇప్పుడు ఎంతమంది నీ వెనకాల ఉన్నారు నీ వెంటపడుతున్నారు కారణం నువ్వు వేసుకునే ఈ కొత్త బట్టలే కారణం! ఇది ఒక తండ్రి చెప్పే మాటలా?

ఇలాంటివి చిత్రాలలో చేర్పించి ఒక ఉష్ణ మండలంలో పనికి వచ్చే బట్టలు కొనిపించడం మొదలు పెట్టారు, కానీ భారతా వానిలో 3 కాలాలు ఉంటాయి అన్న విషయం ప్రజలు మరచి పోయేలా చేసారు. ఇప్పుడు ప్రజలు ప్రతీ కాలానికి దానికి తగ్గ బట్టలు కొనుక్కోవడం, అవి ఇంకో కాలంలో పనికి రాకపోతే ఆ కాలానికి సరిపడా బట్టలు మళ్ళీ కొనుక్కోవడం అలవాటు చేసారు, వెంటనే ధర్జీలు చేనేత వస్త్ర కార్మికులు ఉపాధి కోల్పోవడం మొదలయ్యింది. అలా అని ఆ బట్టలు తప్పు అని కాదు, భారతావనిలో ఎక్కువ శాతం 3 కాలాలు ఉంటాయి, అందుకే మన పెద్దలు చీరలు లాల్చి పైజామాలు వాడేవారు ఇక్కడ సంప్రదాయం అన్న పదం కొంతమంది వల్ల వచ్చింది.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.